ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Winter Superfoods : శీతాకాలం ఆహారంలో చేర్చుకోవలసిన సూపర్ ఫుడ్స్ ఇవే..!

ABN, Publish Date - Jan 18 , 2024 | 04:39 PM

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి చల్లగా ఉండే వాతారవణంలో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

boost energy levels

ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల శరీరం గతంలో కంటే వెచ్చదనం, పోషణను కోరుకుంటుంది. దీనికి చలికాలం అనేక రకాల రుచికరమైన, పోషకాలతో కూడిన సూపర్‌ఫుడ్‌లను తీసుకోవాలి, ఇలా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి చల్లగా ఉండే వాతారవణంలో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ముఖ్యంగా ఏ ఆహారాలను ఈ చలికాలం తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం.

చిలగడ దుంపలు..

విటమిన్ ఎ, సి కలిగిన చిలగడ దుంపలు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. ఇందులో చాలా వరకూ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజ, ద్రాక్ష పండ్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఫ్లూ, జలుబు వంటి వాటి నుంచి రక్షిస్తాయి.

బ్రోకలీ..

ఫైబర్, విటమిన్లు కె, సి లతో నిండిన బ్రోకలీ పూర్తి ఆరోగ్యాన్ని అందించే సూపర్ ఫుడ్. దీనిని చాలా రకాలుగా తినవచ్చు. బ్రోకలీ స్టైర్ ఫ్రైస్, సూప్స్, సైడ్ డిష్‌గా కూడా తీసుకోవచ్చు.

వాల్ నట్స్

గుండెకు ఆరోగ్యాన్నిచ్చే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు బాదం, వాల్ నట్స్, చియా గింజలలో, అవిసె గింజలలో ఉన్నాయి. అవి ముఖ్యమైన పోషకాలు, మంచి కొవ్వులను కూడా అందిస్తాయి.

ఓట్మిల్..

ఓట్మిల్ చక్కని అల్పాహారం. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఓట్స్ రోగనిరోధక శక్తిని, బీటా గ్లూకాన్ స్థాయిలను పెంచుతుంది.

ఇది కూడా చదవండి: రోజూ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇవే ...


ఒమేగా 3..

యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సాల్మన్ వంటి కొవ్వు చేపలలో పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ లో విటమిన్ డి కంటెంట్ ఆరోగ్యాన్నిస్తుంది.

బచ్చలికూర..

ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉండే బచ్చలికూర సలాడ్, సూప్స్, స్మూతీస్‌లలో బావుంటుంది.

అల్లం..

శీతాకాలపు ఆహారంలో అల్లం తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను అందిస్తుంది. తాజా అల్లంలో రుచి, ఆరోగ్యప్రయోజనాలు అనేకం. ఇది టీలు, సూప్స్, కర్రీలకు మంచి రుచిని అందిస్తుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 18 , 2024 | 04:39 PM

Advertising
Advertising