Share News

Blood Sugar : రోజూ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇవే ...

ABN , Publish Date - Jan 18 , 2024 | 03:40 PM

ఆలివ్ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొత్తం ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి. ఆలివ్ నూనెలోని సమ్మేళనాలు, వివిధ బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా యాంటీమైక్రోబయల్ ప్రభావాలను చూపుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Blood Sugar : రోజూ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇవే ...
olive oil

ఆలివ్ నూనె ప్రపంచ వ్యాప్తంగా వంటలో ఓ భాగం అయిపోయింది. రుచికరమైన వంట నూనెగా మాత్రమే కాకుండా ఆరోగ్యం, దీర్ఘాయువు, శక్తికి చిహ్నంగా ఉన్న ఈ నూనె వంటకు గొప్ప రుచిని ఇస్తుంది. మధ్యధరా నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఆలివ్ నూనె గురించి, దీనితో కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది..

ఆలివ్ ఆయిల్ మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంది, ముఖ్యంగా ఒలీయిక్ యాసిడ్‌తో కలిసి ఉంటుంది. ఇందులోని 'మంచి కొవ్వులు' హానికరమైన LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రయోజనకరమైన HDL కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆలివ్ ఆయిల్ సమృద్ధిగా ఉన్న మధ్యధరా వాసులలో గుండె సంబంధ సమస్యలు గణనీయంగా తగ్గాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

కాస్త ఎక్కువగానే యాంటీఆక్సిడెంట్లు..

ఆలివ్ ఆయిల్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేసే సహజ పోషకాలను కలిగి ఉంది. ఈ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ E , ఒలియోకాంతల్ వంటివి, కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి, ఇవి క్యాన్సర్, అల్జీమర్స్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

యాంటీ బాక్టీరియల్..

ఆలివ్ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొత్తం ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి. ఆలివ్ నూనెలోని సమ్మేళనాలు, వివిధ బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా యాంటీమైక్రోబయల్ ప్రభావాలను చూపుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

ఇది కూడా చదవండి: 12th ఫెయిల్ మూవీ గురించి ఆనంద్ మహేంద్ర రివ్యూ ఎలా ఉందంటే..!


స్ట్రోక్స్‌..

రోజువారీ ఆహారంలో ఆలివ్ ఆయిల్‌ను చేర్చుకోవడం వల్ల స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. మోనోశాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహకరిస్తుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు వంటి కారకాలను తగ్గించడంలో కూడా ఆలివ్ నూనె ఏజెంట్‌గా మారుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు..

ఆలివ్ ఆయిల్ మోనోశాచురేటెడ్ కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, ఇది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్ ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆలివ్ నూనె ఉపయోగించడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 18 , 2024 | 03:49 PM