Boiled water vs filtered water : ఈ నీటిలో ఏది బెస్ట్ అంటారు..!
ABN, Publish Date - Jan 30 , 2024 | 04:30 PM
శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారంతో పాటు, నీరు కూడా శుభ్రంగానే ఉండాలి. కలుషిత నీరు అనారోగ్యాలకు దారితీస్తుంది.
నీటిని మరిగించి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు. నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు తొలగి నీరు ఆరోగ్యాన్ని ఇస్తుంది. పరిశరాల్లోని అపరిశుభ్రత కారణంగా భూమిలోని మలినాల కారణంగా నీరు ఆరోగ్యంగా ఉండనపుడు మనం చేసే పని నీటిని మరగకాచి తీసుకోవడం లేదా సుద్ధి చేసి తీసుకోవడం. అసలు ఈ రెండు పద్దతుల్లో ఏది శరీరానికి మంచిది అనే కారణాన్ని ఆలోచిస్తే.. శరీరంలో మలినాలను తొలగించుకునేందుకు తీసుకునే నీరు శుభ్రంగా ఉండాలి. కానీ ఈ రెండు విధానాల్లో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.
శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారంతో పాటు, నీరు కూడా శుభ్రంగానే ఉండాలి. కలుషిత నీరు అనారోగ్యాలకు దారితీస్తుంది. శుభ్రమైన నీటిని తాగడానికి ఆరోగ్యకరమైన త్రాగునీటికి మరగ కాయడం ఓ పద్దతి. అలాగే ఫిల్డర్ చేయడం కూడా చేస్తూ ఉంటాం. కాయడంతో పోల్చితే ఫిల్టర్ చేయడం అనేది చాలా సులువైన పద్దతి. నీటిలోని కలుషితాలను తొలగించే సామర్థ్యం వాటర్ ఫిల్టర్ కు సాధ్యం అవుతుంది. వడపోత ప్రక్రియ ద్వారా త్రాగునీటిని ఆరోగ్యకరంగా మారుస్తుంది.
సాధారణ రకం ఫిల్టర్, ఇది నీటి నుంచి మలినాలను లాగడం ద్వారా నీటిని ఫిల్టర్ లోని యాక్టివేట్ చేసిన బొగ్గు, వైరస్లు, బాక్టీరియా నుంచి నీటిని వడపోత ద్వారా సుద్ధి చేస్తుంది. అయాన్లను సోడియంతో భర్తీ చేస్తారు. వడపోత బ్యాక్టీరియా ఇతర కణాల తొలగింపులో సమర్థవంతంగా పని చేయదు.
ఇది కూడా చదవండి: చ్యవనప్రాష్‌ను రోజూ తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు ఇవే..
అదే మెకానికల్ ఫిల్టర్‌లతో నీటిని సుద్ధి చేసినట్లయితే.. సాధారణంగా పూర్తి వడపోతలో నైలాన్ ఫ్లాస్, సింథటిక్ ఫోమ్ లేదా ప్యాడ్‌లను ఉపయోగించి భౌతిక పదార్థాలను పట్టుకోవడం ద్వారా పనిచేస్తుంది. దీనిని మొత్తం నీటిని శుద్ధి చేసేందుకు పరిష్కారంగా కాకుండా ప్రీ-ఫిల్టర్‌గా ఉపయోగించాలి.
మరిగించిన నీరు..
నీటిని మరిగించి తాగడం చాలా మందిలో ఉన్న అలవాటు. దీని వల్లన దీనిలోని మలినాలు నశిస్తాయి. కానీ మరిగే నీటికంటే ఫిల్టర్ నీటిలో సీసం, క్లోరిన్ హానికరమైన కలుషితాలను వదిలేస్తుంది. వాటర్ ఫిల్టర్ ని ఉపయోగించడం వ్లల నీటిని మరిగించడం, చల్లబరచడంతో పోల్చితే ఫిల్టర్ నీరు ఒక బటన్ తో పట్టుకుని తాగడం చాలా సులువు. అదే కాచిన నీరు అయితే స్టోరేజ్ చేసే విధానం సరిగా లేకపోతే మళ్ళీ క్రిములు చేసే అవకాశం ఉంటుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
Updated Date - Jan 30 , 2024 | 04:30 PM