Share News

Chyawanprash: చ్యవనప్రాష్‌ను రోజూ తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు ఇవే..

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:41 PM

చ్యవాన్ ప్రాష్.. దీనిలో అనేక మూలికలు, ఔషదాలు కలిపి తయారు చేస్తారు. వీటితో పాటు అనేక సుగంధ ద్రవ్యాలు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సితో కలగలిపి ఉంటుంది.

Chyawanprash: చ్యవనప్రాష్‌ను రోజూ తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు ఇవే..
overall immunity

పూర్వం రోజులు నుంచి పెద్దలు తింటూ వస్తున్న మూలికల లేహ్యం చ్యవన్ ప్రాష్.. దీనిని అనేక మూలికలు, ఔషదాలు కలిపి తయారు చేస్తారు. వీటితో పాటు అనేక సుగంధ ద్రవ్యాలు, పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఎక్కువగా విటమిన్ సితో కలగలిపి ఉంటుంది. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలతోపాటు, ఇమ్యునోమోడ్యులేటరీ ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. పెద్దలు రోజూ రెండుసార్లు ఒక టీస్పూన్ తీసుకోవాలి. పిల్లలకు, అర టీస్పూన్ చొప్పున ఇవ్వాలి. అయితే అల్పాహారం తీసుకునే ముందు చ్యవన్ ప్రాష్ తీసుకోవాలి. రాత్రి భోజనం అయిన తర్వాత రెండు గంటల తర్వాత తీసుకోవాలి. ఇంకా దీనితో..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చ్యవన్ ప్రాష్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని సూక్ష్మజీవులతో పోరాడేందుకు, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించేందుకు సహకరిస్తుంది. ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చ్యవన్ ప్రాష్‌లో ఉన్నాయి.

జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

చ్యవన్ ప్రాష్ మంచి జీర్ణక్రియకు ప్రసిద్ధి చెందింది. ఇందులో ఉండే యాంటీ ఫ్లాంటులెంట్స్ పొట్టలో గ్యాస్ ఏర్పడడాన్ని తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

గుండె పనితీరులో...

చ్యవన్ ప్రాష్ రోజూ తీసుకోవడం వల్ల అందులోని మూలికలు గుండెకు బలాన్నిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇందులోని అశ్వగంధ, అర్జున మూలికలు గుండె జబ్బులకు చికిత్స చేస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.


ఇది కూడా చదవండి: ఈ మఖండి హల్వా ఎలా చేయాలంటే..

వయస్సును అదుపులో ఉంచుతుంది.

చ్యవన్ ప్రాష్ కణజాల పెరుగుదలకు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న కారణంగా సెల్యులార్ దెబ్బితనకుండా శరీరాన్ని రక్షిస్తుంది. ఊపిరి తిత్తులు, కాలేయం, గుండె, చర్మం కణజాలాలలో వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది.

చర్మ నిగారింపు..

చ్యవన్ ప్రాష్ రోజూ తీసుకోవడం వల్ల చర్మం నిగారింపుతో ఉంటుంది. మచ్చలేని ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది. చ్యవన్ ప్రాష్‌లో ఉండే యాంటీ ఇన్ఫమేటరీ మూలికలు మెటిమలు, జిట్స్, మొటిమలు వంటి అలెర్జీ పరిస్థితులను తగ్గించడంలో సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 30 , 2024 | 03:45 PM