Sea Food: మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన ఎనిమిది సీఫుడ్స్ ఇవే.. !
ABN, Publish Date - Jan 25 , 2024 | 01:24 PM
వారానికి కనీసం రెండు సార్లు సాల్మన్ చేపను తినడం వల్ల మధుమేహం ఉన్నవారికి మంచి ఉపశమనం కలుగుతుంది.
చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం చాలామందికి తెలిసిన విషయమే. సముద్ర చేపలలో ఎన్నో రకాలు.. వీటిలో చాలా రకాలు మనకు అందుబాటులో దొరికేవే.. చేపల్ని అన్ని వయసుల వారు ఇష్టంగా తింటారు. చేపలోని ప్రోటీన్స్ ప్రతి ఒక్కరికీ బలాన్ని ఇస్తాయి. ఇందులో ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారిలో సీఫుడ్స్ చక్కని సపోర్ట్ ఇస్తాయి. సాల్మన్ చేపల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు సాల్మన్ చేపలను ఎంచుకోవడం వల్ల ఒమేగా - 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బులను, గుండె వైఫల్యం నుండి స్ట్రోక్స్ నుంచి కాపాడుతాయి. వారానికి కనీసం రెండు సార్లు సాల్మన్ చేపను తినడం వల్ల మధుమేహం ఉన్నవారికి మంచి ఉపశమనం ఉంటుంది. చేపలు త్వరగా చెడిపోతాయి కనుక వాటిని ఉప్పు కలిపి ఎండబెట్టి కూడా తీసుకుంటూ ఉంటాం. ఇవి కూడా ఆరోగ్యాన్ని పెంచుతాయి. చేపల్లోని రకాలు వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
1. టిలాపియా చేపల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి. ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.
2. తెల్ల చేపలలో అధిక ప్రోటీన్ ఉంటుంది. మధుమేహం ఉన్నవారు దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఇది మంచి ఎంపిక.
ఇదికూడా చదవండి: రేగిపండును శీతాకాలంలో తప్పక తీసుకోవాలి.. ఎందుకంటే..!
3. ట్రౌట్ చేపలో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ నిండి ఉంటాయి. ఇది కొవ్వు చేప. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
4. రొయ్యలలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మధుమేహం ఉన్నవారికి ఇది ఆరోగ్యకరమైన ఆహారం.
5. క్యాన్డ్ ట్యూనా చేపలో అనేక ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ కలిగి ఉంది. మధుమేహం ఉన్నవారు తినడం ఆరోగ్యానికి మంచిది.
6. సార్డినెస్ చేపల్లో ఒమేగా - 3, కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయి. ఎముకల బలాన్ని పెంచుతాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
Updated Date - Jan 25 , 2024 | 01:24 PM