Share News

Jujube : రేగిపండును శీతాకాలంలో తప్పక తీసుకోవాలి.. ఎందుకంటే..!

ABN , Publish Date - Jan 25 , 2024 | 12:10 PM

రక్తంలో చక్కెర తగ్గించే గుణాన్ని కూడా రేగి పండు కలిగి ఉంది. ఇది మధుమేహం ఉన్నవారు తినాల్సిన పండు. శీతాకాలంలో అందుబాటులో ఉన్న రేగిపండ్లను తినడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను నివారించవచ్చు.

Jujube : రేగిపండును శీతాకాలంలో తప్పక తీసుకోవాలి.. ఎందుకంటే..!
jujube fruit

శీతాకాలంలో లభించే చాలా పండ్లలో రేగిపండ్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. రేగిపండ్లను జుజుబ్, బెర్ పండ్లను పోలి ఉంటాయి. వీటిని కొరియన్ డేట్, చైనీస్ డేట్ అని కూడా పిలుస్తారు. దీనిని ప్రధానంగా దక్షిణాసియాలో పండిస్తారు. ఈ పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రేగిలో ఒత్తిడి తగ్గించే గుణాలున్నాయి. మెదడు, నాడీవ్యవస్థపై ప్రశాంతమైన ప్రభావాలను కలిగిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రేగిలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడటమే కాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

రక్తంలో చక్కెర తగ్గించే గుణాన్ని కూడా రేగి పండు కలిగి ఉంది. ఇది మధుమేహం ఉన్నవారు తినాల్సిన పండు. శీతాకాలంలో అందుబాటులో ఉన్న రేగిపండ్లను తినడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను నివారించవచ్చు. బెర్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలు, జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే మలబద్దకం నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. దీనిలో ఉన్న మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.

మెరుగైన నిద్ర..

రేగిపండ్లను తీసుకోవడం వ్లల నిద్రలేమి సమస్య తగ్గుతుందని చైనీస్ వైద్యంలో బాగా నమ్ముతారు. ఈ పండ్లలో ఫ్లెవనాయిడ్లు, సపోనిన్లు, పాలీశాకరైడ్లు చక్కని నిద్రను ఇస్తాయి.

రక్తపోటుకు..

రక్తపోటును నియంత్రించడంలోనూ తక్కువ ఉప్పు, అధిక పొటాషియం కలిగిన రేగి పనిచేస్తుంది.


ఇది కూడా చదవండి: ఒత్తిడిని, బరువును తగ్గించే నాణ్యమైన నిద్రకు నాలుగు చిట్కాలివే..!


రక్తన్ని పెంచుతుంది.

వీటిలో ఐరెన్., ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్త ప్రసరణను నియంత్రించడంలో సహకరిస్తాయి.

ఎముకలకూ బలమే..

రేగిలోని కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఎముకల బలాన్ని పెంచుతాయి.

గాయాలు తగ్గడంలో..

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి, సితో నిండినందున, రేగి పండు త్వరగా నయం చేసే లక్షణాలను కలిగి ఉంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 25 , 2024 | 12:10 PM