Share News

Quality Sleep : ఒత్తిడిని, బరువును తగ్గించే నాణ్యమైన నిద్రకు నాలుగు చిట్కాలివే..!

ABN , Publish Date - Jan 25 , 2024 | 11:11 AM

పుస్తకాన్ని చదవడం, తోటపని, పచ్చని ప్రదేశంలో కాసేపు గడపడం వంటివి, వెచ్చని స్నానం చేయడం వంటి పనులు ప్రశాంతమైన నిద్రకు కారణం అవుతాయి.

Quality Sleep : ఒత్తిడిని, బరువును తగ్గించే నాణ్యమైన నిద్రకు నాలుగు చిట్కాలివే..!
Health Sleep

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి.. దానితోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అంతే అవసరం. సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా విసుగ్గా అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించదు. అలాంటిది సమయంలోనే నిద్రలేమి వల్ల ఒత్తిడి లక్షణాలు కూడా పెరుగుతాయి. దీనితో బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యం కోసం సరైన జీవన నియమావళి అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఒత్తిడిని, ఊబకాయాన్ని నియంత్రించే నిద్రను పొందాలంటే..

ఒత్తిడి .. ఊబకాయం.. సరైన నాణ్యమైన నిద్ర ఒత్తిడిని తగ్గించడంలో మంచి సపార్ట్‌గా ఆరోగ్యానికి నిలుస్తుంది. శరీరానికి తగినంత విశ్రాంతి లేనప్పుడు, ఒత్తిడి హార్మోన్ స్థాయిలు, ముఖ్యంగా కార్టిసాల్ పెరుగుతాయి. ఎలివేటెడ్ కార్టిసాల్ స్థాయిలు ఒత్తిడి, ఆందోళన,బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది. సరైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, చక్కని ఉదయాన్ని పొందుతారు. అలాగే.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

కొవ్వు నష్టం.. కొవ్వును కాల్చే శరీర సామర్థ్యంలో నాణ్యమైన నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర లేమి ఆకలి, సంతృప్తికి సంబంధించిన హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది, ఇది అధిక కేలరీలు, చక్కెర కలిగిన ఆహారాలను తినాలనే కోరికను పెంచుతుంది. ఈ కారణంగా సరిపోని నిద్ర శరీర జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది, బాగా విశ్రాంతి తీసుకున్నప్పుడే, శరీరంలోని క్రియలు సరిగా జరిగి ఆరోగ్యంగా ఉంటారు.


నాణ్యమైన నిద్ర..

సరైన నిద్ర షెడ్యూల్.. వారంరోజుల్లో ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొలపడం వల్ల సరైన నిద్ర షెడ్యూల్ అనుసరిస్తే.. చక్కని ఆరోగ్యం మనసొంతం అవుతుంది. ఇది శరీరం అంతర్గత గడియారాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

రిలాక్సింగ్ మూడ్.. శరీరానికి ఇది చాలా అవసరం. దీనికోసం నచ్చిన పనిని ఎంచుకోవాలి. పుస్తకాన్ని చదవడం, తోటపని, పచ్చని ప్రదేశంలో కాసేపు గడపడం వంటివి, వెచ్చని స్నానం చేయడం వంటి పనులు ప్రశాంతమైన నిద్రకు కారణం అవుతాయి.

ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో చర్మ సమస్యలు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

నిద్ర వాతావరణాన్ని సృష్టించుకోండి.. పడకగదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచడం మూలాన నిద్ర ప్రశాంతంగా పడుతుంది. మొత్తం నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సౌకర్యవంతమైన పరుపు, దిండ్లను ఎంచుకోవాలి.

స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవాలి.. నిద్రవేళకు కనీసం ఒక గంట ముందు స్క్రీన్‌లకు ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకోవాలి, ఈ పరికరాల నుంచి విడుదలయ్యే బ్లూ లైట్ నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చక్కని నిద్ర మీ సొంతం అవుతుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 25 , 2024 | 11:11 AM