ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pertussis : ముక్కుకారడం, దగ్గు లక్షణాలను సాధారణ జలుబు అనుకుంటే పొరపాటే.. దీనికి ప్రధాన కారణం..!

ABN, Publish Date - Jan 31 , 2024 | 12:05 PM

దగ్గు విపరీతంగా ఉంటుంది. పరోక్సిమ్స్ తరుచుగా రాత్రిపూట మరీ ఎక్కువగా ఉంటుంది. ఊపిరి పీల్చే సమయంలో హూప్ అనే శబ్దం వస్తుంది. వాంతులు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి.

cough

కాసంత వాతావరణంలో మార్పు కనిపించినా, ఆహారంలో మార్పు చేసినా వెంటనే జలుబు, దగ్గు వచ్చేస్తాయి. విపరీతమైన పొడిదగ్గు వేధిస్తూ ఉంటుంది. వాతావరణంలో మార్పు మాత్రమే కారణంకాకుండా, కాస్త చల్లని ఆహారం తీసుకున్నా, చల్లదనం శరీరానికి తగిలినా కూడా తేడా దానంతట అదే వస్తుంది. ఈ నిరంతర దగ్గును పెర్టుసిస్ అని పిలుస్తారు. 100 రోజుల పాటు ఆ దగ్గు ఉంటుంది. దీనికి గల కారణాలు, లక్షణాలు, చికిత్సా గురించి తెలుసుకుందాం.

100 రోజుల దగ్గు..

100 రోజుల దగ్గు, పెర్టుసిస్ లేదా కోరింత దగ్గు అనేది బోర్డెటెల్లా పెర్టుసిస్ అనే బాక్టీరియా వల్ల కలుగుతుంది. ఇది అంటు వ్యాధి. శ్యాసకోసానికి సంక్రమిస్తుంది. దీని ప్రధాన లక్షణాలు దగ్గు, తుమ్ములు, మాట్లాడటం ద్వారా కూడా సంక్రమిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందని శిశువులు, చిన్నపిల్లల్లో ఇది అత్యంత ప్రమాదకరం.

పెర్టుసిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

ఒకటి, రెండు వారాలు.. ముక్కు కారడం, మూసుకుపోవడం, చిన్నగా జ్వరం, తేలికపాటి దగ్గు ఉంటుంది. ఇక పిల్లల్లో మరీ దగ్గు ఉండకపోవచ్చు కానీ అప్నియా, సైనోసిస్ లక్షణాలుంటాయి. ఈ లక్షణాలను సులభంగా జలుబుగా భావిస్తాం. కానీ ఇది రోగనిర్థారణకు సవాలుగా మారుతుంది.

రెండు మూడు వారాలు.. దగ్గు విపరీతంగా ఉంటుంది. పరోక్సిమ్స్ తరుచుగా రాత్రిపూట మరీ ఎక్కువగా ఉంటుంది. ఊపిరి పీల్చే సమయంలో హూప్ అనే శబ్దం వస్తుంది. వాంతులు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి.

ఇది కూడా చదవండి: ఇవి తింటే చాలు ఒత్తిడి, ఆందోళన పరార్..!


పెర్టుసిస్ కారణాలు..

పెర్టుసిస్ బోర్డెటెల్లా బ్యాక్టీరియం. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినపుడు, తుమ్మినపుడు, లేదా మాట్లాడినపుడు గాలి ద్వారా మరొకరికి ఈ వ్యాధి సోకుతుంది.

చికిత్స..

పెర్టుసిస్ ను ముందుగా గుర్తించడం., చికిత్స చేయడం, ఈ లక్షణాల తీవ్రతను తగ్గించడానికి, ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిరోధించడానికి కీలకం. అజిత్రోమైసిన్, ఎరిత్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ సాధారణంగా పెర్టుసిస్‌తో బాధపడేవారికి సూచిస్తారు. ఈ మందులు లక్షణాల వ్యవధి తీవ్రతను తగ్గించడానికి సహాయపడతాయి.

నివారణ..

పెర్టుసిస్‌ను వివారించడానికి టీకాలు వేయడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. DTAP (డిప్టీరియా, టైటానస్, ఎసెల్యులర్ పెర్టుస్సిస్) టీకా పిల్లలకు వేయించాలి. ఇది పెర్టుసిస్ సమస్యను తగ్గిస్తుంది. టీడాప్ అనే బూస్టర్ వ్యాక్సిన్ కూడా పెద్దలకు రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 31 , 2024 | 12:05 PM

Advertising
Advertising