Share News

Feeling Sad : ఇవి తింటే చాలు ఒత్తిడి, ఆందోళన పరార్..!

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:51 AM

మనం తినేవి, తాగ్రే ఆహారాల ద్వారా ఒత్తిడిని, ఆందోళన నుంచి రిలీఫ్ పొందవచ్చు. అవకాడోలు, గుడ్లు, నారింజలు ఆందోళనను తగ్గిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు ఆందోళన లక్షణాలను కంట్రోల్ చేస్తాయి.

Feeling Sad : ఇవి తింటే చాలు ఒత్తిడి, ఆందోళన పరార్..!
Anxiety

బాగా కోపంలో ఉన్నా, బాగా సంతోషంగా ఉన్నా ఎక్కువగా తినేసే వాళ్ళను చూస్తూ ఉంటాం. మరి అస్సలు మూడ్ బాగాలేనప్పుడు తీసుకునే ఆహారం మూడ్ సెట్ చేస్తుందని మీకు తెలుసా.. మనం తినేవి, తాగ్రే ఆహారాల ద్వారా ఒత్తిడిని, ఆందోళన నుంచి రిలీఫ్ పొందవచ్చు. అవకాడోలు, గుడ్లు, నారింజలు ఆందోళనను తగ్గిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు ఆందోళన లక్షణాలను కంట్రోల్ చేస్తాయి. ఉదాహరణకు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటి గురించి తెలుసుకుందాం.

చక్కెర, కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలు ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తాయి. మనం తీసుకునే ఆహారాలు ఆందోళనును తగ్గించేవిగా ఉండాలి.

అవకాడోలు..

అవకాడోలలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది. దీనిలో ఇంకా..

ఫోలేట్ (బి9)

నియాసిన్ (బి3)

పాంతోతేనిక్ ఆమ్లం (బి5)

రిబోప్లావిన్ (బి2)

విటమిన్ (బి6) ఉన్నాయి.

బ్లూబెర్రీస్..

బ్లూబెర్రీస్ లో ఒత్తిడిని తగ్గించే గుణాలున్నాయి. బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి సెల్ డ్యామేజ్‌ని తగ్గిస్తాయి.

కాల్షియం రిచ్ ఫుడ్స్..

కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులతో కలిపి తీసుకోవడం, అలాగే పాలకూర, కాలే వంటి కూరగాయలు తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడికి రిలీఫ్ ఉంటుంది. కాల్షియం తీసుకునేవారు ఒత్తిడి స్థాయిలు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: కిడ్నీ స్టోన్స్ లక్షణాలు, వాటిని గుర్తించే ఐదు సంకేతాలు ఇవే...!


గుడ్లు

ఆందోళన లక్షణాలు కేంద్ర నాడీ వ్యవస్థలో సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లపై ఆధారపడి ఉంటాయి. గుడ్డు సొనలో విటమిన్ డి ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ పనితీరులో సహాయపడతాయి. డిప్రెషన్, ఆందోళన లక్షణాలను తగ్గిస్తాయి.

కూరలు..

కాయగూరలు, పండ్లు తీసుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. కూరగాయలలో ముదురు ఆకు కూరలు, క్యారెట్లు, దోసకాయలు తీసుకోవాలి.

గింజలు, విత్తనాల

జీడిపప్పు, మెగ్నీషియం, మానసిక స్థితి, ఆందోళన లక్షణాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. చియా విత్తనాలు, గుమ్మడి గింజలు, మెగ్నీషియం అధికంగా కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 30 , 2024 | 11:51 AM