Share News

Kidney Stones: కిడ్నీ స్టోన్స్ లక్షణాలు, వాటిని గుర్తించే ఐదు సంకేతాలు ఇవే...!

ABN , Publish Date - Jan 29 , 2024 | 04:41 PM

రాళ్ళు మూత్ర పిండాలలో ఏర్పడ్డాయనే విధానాన్ని కొన్ని సంకేతాల ద్వారా లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.

Kidney Stones: కిడ్నీ స్టోన్స్ లక్షణాలు, వాటిని గుర్తించే ఐదు సంకేతాలు ఇవే...!
health condition

మూత్రపిండాల్లో రాళ్లు మూత్ర వ్యవస్థకు సంబంధించిన అత్యంత సాధారణ ఆరోగ్య పరిస్థితి. కానీ వీటితో శరీర వ్యవస్థకు చాలా ఆటంకం కలుగుతుంది. దీనిని నెప్రోలిత్, మూత్రపిండ కాలిక్యూలి అని కూడా పిలుస్తారు. రాళ్ళు మూత్ర పిండాలలో ఏర్పడ్డాయనే విధానాన్ని కొన్ని సంకేతాల ద్వారా లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రాళ్ళు మూత్ర పిండ ద్వారం ద్వారా శరీరం నుంచి బయటకు వచ్చేంత చిన్నవిగా ఉంటాయి. కానీ ఇవే పెద్దవి అయితే మాత్రం విచ్ఛిన్నం చేయడానికి లేదా తీసి వేసేందుకు వైద్య చికిత్స అవసరం అవుతుంది. కిడ్నీలో రాళ్లు వచ్చే తీవ్రమైన సమస్యను పరిష్కించడానికి తీవ్రమైన లక్షణాలను గురించి తెలుసుకుందాం.

ఈ 5 లక్షణాలతో కిడ్నీలో రాళ్లున్నట్టే..

వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి: మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పాడ్డాయని తెలిసే మొదటి ప్రధాన లక్షణాలలో వెనుక వైపు నొప్పి. ఈ నొప్పి బాధాకరంగా ఉంటుంది. పొత్తికడుపు, గజ్జ ప్రాంతం వరకు కూడా వ్యాపిస్తుంది.ఇది అసౌకర్యాన్ని పెంచుతుంది.

మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట: రాళ్లు, మూత్రాశయం మధ్య చేరిన తర్వాత, మూత్ర విసర్జన చేసినప్పుడు నొప్పి ఉంటుంది. నొప్పితో పాటు మంటగా కూడా అనిపించవచ్చు. దీనిని డైసూరియా అని పిలుస్తారు.

ఇది కూడా చదవండి: మంచి ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ ఉదయాన్నే తింటే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే..!


మూత్రంలో రక్తం: మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారిలో ఇది సాధారణ లక్షణం. ఈ లక్షణాన్ని హెమటూరియా అని కూడా అంటారు. రక్తం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో ఉంటుంది.

వికారం, వాంతులు: మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి వికారం, వాంతులు ఉండటం సాధారణం. మూత్రపిండాలు, GI ట్రాక్ట్ మధ్య నరాల కనెక్షన్ల కారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇది తీవ్రమైన నొప్పికి కారణం కావచ్చు.

జ్వరం, చలి: జ్వరం అనేది మూత్రపిండంలో లేదా మూత్ర నాళంలోని మరొక భాగంలో ఇన్ఫెక్షన్‌కు సంకేతంగా కనిపిస్తుంది. ఈ జ్వరాలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి - 100.4˚F (38˚C) లేదా అంతకంటే ఎక్కువగా కనిపించవచ్చు. జ్వరంతో పాటు చలి, వణుకు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 29 , 2024 | 04:42 PM