ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chennai: దేశంలోనే తొలిసారి.. టికెట్ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపీ..

ABN, Publish Date - Mar 25 , 2024 | 01:41 PM

తమిళనాడుకు రాష్ట్రం ఈరోడ్‌ నియోజకవర్గానికి గణేశ మూర్తి(74) ఎండీఎంకే పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

చెన్నై: సాధారణంగా ఓ పార్టీ ఒకరికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించిందంటే ఆయన ఏం చేస్తాడు. వేరే పార్టీలోకి జంప్ అయి అక్కడ టికెట్ సంపాదించడమో లేక స్వతంత్ర అభ్యర్థిగానో పోటీ చేస్తాడు. ఆర్థిక స్థోమత లేని వ్యక్తి ఇంట్లో కూర్చుంటాడు లేదా పార్టీపై బహిరంగంగా విమర్శలు చేసి చల్లబడతాడు. అంతేగా.. అయితే ఒకరు మాత్రం పార్టీ టికెట్ ఇవ్వలేదని ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించారు.

ఇలాంటి ఘటన దేశంలో ఇదే తొలిసారి. ఏమైందంటే.. తమిళనాడుకు రాష్ట్రం ఈరోడ్‌ నియోజకవర్గానికి గణేశ మూర్తి(74) ఎండీఎంకే పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించింది. ఎండీఎంకే ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతో చేతులు కలిపింది.

పొత్తులో భాగంగా కొన్ని సీట్లను అధికార పార్టీకి త్యాగం చేశారు. ఇందులో ఈరోడ్‌కి డీఎంకే నుంచి ప్రకాశ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఈయనకే ఈరోడ్ టికెట్ కన్ఫార్మ్ కావడంతో ఆ నియోజకవర్గ టికెట్ ఆశించిన గణేశ మూర్తికి ఆశాభంగం తప్పలేదు.


పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక.. బయటకీ చెప్పుకోలేక గణేశ లోలోపలే మదనపడ్డారు. చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి 10 గంటలకు ఆయన పురుగుల మందు తాగారని కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

టికెట్ నిరాకరించిన కారణంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని వారు అంటున్నారు. 40 ఏళ్లకుపైనే రాజకీయాల్లో ఉన్న ఆయన ఇలా బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగించిందని అభిమానులు అంటున్నారు. 2009, 2019లో రెండు సార్లు గ‌ణేశ మూర్తి ఈరోడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు.

గ‌తంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు. అయితే ఎంపీ బలవన్మరణంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రాజకీయ కురువృద్ధుడిగా మారిన ఆయనకు టికెట్ ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. టికెట్ రాలేదనే కారణంతో బలవన్మరణానికి పాల్పడిన తొలిఎంపీ అయ్యారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 01:43 PM

Advertising
Advertising