ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: లోక్ సభ ఎన్నికల వేళ.. పార్టీలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఈసీ.. ఏమన్నదంటే..

ABN, Publish Date - Mar 01 , 2024 | 08:22 PM

లోక్‌సభ ఎన్నికల వేళ.. ఎన్నికల కమిషన్(EC) రాజకీయ పార్టీలకు, నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారాల్లో కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగడం మానుకోవాలని సూచించింది. మత విశ్వాసాలను కించపరచడం, దైవ దూషణకు పాల్పడకూడదని చెప్పింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఎన్నికల కమిషన్(EC) రాజకీయ పార్టీలకు, నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారాల్లో కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగడం మానుకోవాలని సూచించింది. మత విశ్వాసాలను కించపరచడం, దైవ దూషణకు పాల్పడకూడదని చెప్పింది.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారాలకు ఉపయోగించకూడదని పేర్కొంది. గతంలో నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మళ్లీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.


మార్చి నెలాఖరులోపు లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటనతో మోడల్ కోడ్ అమల్లోకి రానుంది. బహిరంగ సభల్లో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు, ముఖ్యంగా గతంలో నోటీసులు అందుకున్న వారు అదనపు బాధ్యత వహించాలని చెప్పింది.

ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించింది. అబద్ధాలు చెబుతూ ఓటర్లను తప్పుదోవ పట్టించకూడదని, ప్రత్యర్థులను దూషించే లేదా అవమానించే సోషల్ మీడియా పోస్టులు పెట్టడం, షేర్ చేయడం వంటి పనుల్ని చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2024 | 08:55 PM

Advertising
Advertising