ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: టాలీవుడ్‌పై ‘అక్కినేని’ చెరగని ముద్ర

ABN, Publish Date - Dec 30 , 2024 | 04:30 AM

ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని ప్రధాని మోదీ కొనియాడారు.

తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు

రాజ్‌కపూర్‌, మొహమ్మద్‌ రఫీ, తపన్‌ సిన్హా

జీవితాలు యావత్‌ సినీ పరిశ్రమకు స్ఫూర్తి

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని ప్రధాని మోదీ కొనియాడారు. తన కళా వారసత్వంతో టాలీవుడ్‌పై చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలు ఉట్టిపడేవని పేర్కొన్నారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ 117వ ఏపిసోడ్‌లో భాగంగా ఆయన పలు అంశాలపై ప్రసంగించారు. అక్కినేనితో పాటు రాజ్‌కపూర్‌, మొహమ్మద్‌ రఫీ, తపన్‌ సిన్హా భారతీయ సినిమాకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చారని ప్రశంసించారు. వీరి జీవితాలు యావత్‌ సినీ పరిశ్రమకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. వీరి సినిమాలు సామాజిక స్పృహ, జాతీయ ఐక్యత సందేశాన్ని కలిగి ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారతీయ చలనచిత్ర రంగంవైపు చూస్తున్నాయని అన్నారు. వచ్చే ఏడాది తొలిసారిగా వరల్డ్‌ ఆడియో, విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (డబ్ల్యూఏవీఈఎ్‌స)ను మన దేశంలో నిర్వహించనున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రపంచ కంటెంట్‌ సృష్టి కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా ఈ సదస్సు ఒక ముఖ్యమైన అడుగుగా మోదీ అభివర్ణించారు.

ఐక్యతా సందేశం.. మహాకుంభ మేళా

ఉత్తరప్రదేశ్‌లో జనవరి 13 నుంచి జరగనున్న మహాకుంభ మేళా ఐక్యతా సందేశాన్ని ఇస్తుందని మోదీ అన్నారు. విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమం భిన్నత్వంలో ఏకత్వానికి చక్కటి నిదర్శనమన్నారు. ఈసారి డిజిటల్‌ మహాకుంభ్‌ను దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షిస్తారని, కుంభమేళాలో తొలిసారి ఏఐ చాట్‌బాట్‌ సేవలు వినియోగించనున్నట్లు తెలిపారు. చాట్‌ బాట్‌లో కుంభ్‌కు సంబంధించి అన్ని రకాల సమాచారం 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆమోదించిన టూర్‌ ప్యాకేజీలు, వసతి, హోమ్‌స్టే గురించి భక్తులకు వారి మొబైల్‌ ఫోన్లకు సమాచారం అందించనున్నట్లు మోదీ వివరించారు. కాగా, 2015-23 మధ్య కాలంలో దేశంలో మలేరియా కేసులు, మరణాల సంఖ్య 80ు తగ్గిందని డబ్ల్యూహెచ్‌వో నివేదిక పేర్కొందని, ప్రధాని అన్నారు. భారత్‌లో కేన్సర్‌ చికిత్సను సకాలంలో ప్రారంభించే అవకాశాలు పెరిగాయని లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో అధ్యయనం ప్రచురితమైందని గుర్తుచేస్తూ, ఇది దేశ ఆరోగ్య రంగంలో మరో ఘనతగా పేర్కొన్నారు. 90ు మంది కేన్సర్‌ రోగులకు సకాలంలో చికిత్స అందించడంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కీలక పాత్ర పోషించిందని ప్రధాని తెలిపారు.

Updated Date - Dec 30 , 2024 | 04:30 AM