ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: మోదీని కలిసిన సందేశ్‌ఖాలి బాధిత మహిళలు

ABN, Publish Date - Mar 06 , 2024 | 02:54 PM

భూఆక్రమణలు, లైంగిక వేధింపుల ఆరోపణలతో అట్టుడికిన పశ్చిమబెంగాల్‌లోని సందేశ్ ఖాలికి చెందిన బాధిత మహిళలు పలువురు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారంనాడు కలుసుకున్నారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రధాని ఎంతో ఓపికగా వినబడంతో పాటు ఆయన కూడా కలత చెందారు. దీంతో బాధిత మహిళలు మరింత భావోద్వేగానికి గురయ్యారు.

బరాసత్: భూఆక్రమణలు, లైంగిక వేధింపుల ఆరోపణలతో అట్టుడికిన పశ్చిమబెంగాల్‌లోని సందేశ్ ఖాలికి చెందిన బాధిత మహిళలు పలువురు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని బుధవారంనాడు కలుసుకున్నారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రధాని ఎంతో ఓపికగా వినబడంతో పాటు ఆయన కూడా కలత చెందారు. దీంతో బాధిత మహిళలు మరింత భావోద్వేగానికి గురయ్యారు. పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా సందేశ్‌ఖాలి లోక్‌సభ నియోజకవర్గంలోని బరాసత్‌కు ప్రధాని వచ్చారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మోదీ సభకు భారీగా మహిళలు తరలి వచ్చారు.


నార్త్ 24 పరగణాలలోని సందేశ్ ఖాలి నియోజకవర్గం ఇటీవల నిరసనలతో అట్టుడికింది. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్, ఆయన అనుచరులు పలువురు మహిళలపై లైంగిక దాడులు, భూ ఆక్రమణలకు పాల్పడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై బీజేపీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేయగా, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు సాగించారు. షాజహాన్ అరెస్టుకు కోర్టులు జోక్యం చేసుకోవడంతో 40 ఏళ్ల షాజహాన్‌ను గతవారంలో బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా కోల్‌కతా హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Mar 06 , 2024 | 02:56 PM

Advertising
Advertising