PM Modi Banner: అక్కడ మోదీ బ్యానర్ ఉంటే వీళ్లకొచ్చిన బాధేంటో.. విషయం ఏంటంటే...
ABN, Publish Date - Feb 20 , 2024 | 10:34 AM
రేషన్‌షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఫొటో కటౌట్‌తో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయాలన్న భారత ఆహార సంస్థ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది.
- సెల్ఫీ పాయింట్ వద్ద మోదీ బ్యానర్
- వ్యతిరేకిస్తున్న సర్కారు
చెన్నై: రేషన్‌షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఫొటో కటౌట్‌తో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయాలన్న భారత ఆహార సంస్థ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. కేంద్రప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో ప్రధానమంత్రి మోదీ ఫొటో తప్పనిసరిగా ఉంటోంది. అదేవిధంగా రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫొటోతో 30 తాత్కాలిక సెల్ఫీ పాయింట్లను, 20 పర్మినెంట్ సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఎఫ్‌సీఐ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రధాని మోదీ ఫొతో కూడిన కటౌట్లతో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఒక్కో తాత్కాలిక సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుకు రూ.1.25 లక్షలు, పర్మినెంట్ సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుకు రూ.6.25 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఈ సెల్ఫీ పాయింట్లను భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని భావిస్తుంది. అందుకే ప్రధాని మోదీ ఫొటోతో కూడిన కటౌట్లతో సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది.
Updated Date - Feb 20 , 2024 | 10:34 AM