Pawan Kalyan: బెంగళూరులో ఎన్నికల ప్రచారానికి పవన్‌కల్యాణ్
ABN, Publish Date - Mar 30 , 2024 | 02:02 PM
ప్రముఖ తెలుగు నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్(Pawan Kalyan) బెంగళూరులో ఎన్నికల ప్రచారానికి రానున్నారు.
బెంగళూరు: ప్రముఖ తెలుగు నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్(Pawan Kalyan) బెంగళూరులో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. బెంగళూరు నగర వ్యాప్తంగా తెలుగు ప్రజలు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారు. దీంతో పవన్‌కల్యాణ్ ద్వారా ప్రచారాలు నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. చిక్‌పేట బీజేపీ ఎమ్మెల్యే ఉదయ్‌గరుడాచార్ నివాసంలో గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో చర్చించారు. ప్రతిపక్షనేత అశోక్, ఎంపీ తేజస్వీ సూర్య తదితరులు పాల్గొన్న సభలో బెంగళూరు దక్షిణ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంపై ప్రణాళికలు సిద్ధం చేశారు. బెంగళూరు దక్షిణ పరిధిలో బొమ్మనహళ్లి, బీటీఎం లేఅవుట్, హెచ్‌ఎ్‌సఆర్ లేఅవుట్, జయనగర్, జేపీనగర్, బసవనగుడితో పాటు బెంగళూరు సెంట్రల్ పరిధిలోని మారతహళ్లి, బెంగళూరు ఉత్తర పరిధిలోని యలహంక ప్రాంతాల్లో పవన్‌కల్యాణ్ రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్‌కు ఎన్నికల ప్రచారాలు ఉన్న నేపథ్యంలో వీలు చూసుకుని రోడ్‌షోలు నిర్వహించేలా షెడ్యూలు కోరదలచినట్లు తెలుస్తోంది.
Updated Date - Mar 30 , 2024 | 02:02 PM