ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: ఇండియన్లను సోమరులుగా భావించిన నెహ్రూ

ABN, Publish Date - Feb 05 , 2024 | 09:27 PM

రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీకే చెందిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పైన పవర్‌ఫుల్ పంచ్‌లు విసిరారు. భారతీయులు సోమరులనే అభిప్రాయంతో పండిట్ నెహ్రూ ఉండేవారని అన్నారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీకే చెందిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) పైన పవర్‌ఫుల్ పంచ్‌లు విసిరారు. భారతీయులు సోమరులనే అభిప్రాయంతో పండిట్ నెహ్రూ ఉండేవారని అన్నారు.


భారతీయులకు కష్టపడి పనిచేసే అలవాటు లేదని ఎర్రకోట నుంచి నెహ్రూ అప్పట్లో చెప్పారనీ, యూరప్, జపాన్, చైనా, రష్యా, అమెరికా ప్రజలు కష్టపడినంతగా ఇండియన్లు కష్టపడలేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. 1959లో ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి నెహ్రూ ప్రసంగిస్తూ ''ఒక జాతి ఎలా ఎదుగుతుంది? కఠోర శ్రమతోనే సాధ్యం. కఠోర శ్రమ ద్వారా మన దేశం పురోగతి సాధించాలి. తద్వారా సంపద సృష్టి జరుగుతుంది. ప్రంపచంలోని సంపన్న దేశాలను ఒకసారి చూడండి. దానిని వాళ్లు ఏ విధంగా సాధించారు? కరోఠ శ్రమతో సాధించారు. ఇండియాలో ప్రజలు ఎక్కువగా కష్టపడరు. అది మన తప్పు కాదు. పాతుకుపోయిన అలవాట్లే కారణం. యూరప్, జపాన్, చైనా, రష్యా, అమెరికా కష్టపడినట్టు మనం కష్టపడటం. ఏదో అద్భుతాలతో ఆ దేశాలు సంపన్నదేశాలు కాలేదు. కఠోర శ్రమే కారణం. మనం కూడా కష్టపడటం, తెలివితేటలతో ముందుకు వెళ్లడం మినహా మరో మార్గం లేదు'' అని పేర్కొన్నట్టు మోదీ తెలిపారు.


ఇందిర కూడా...

నెహ్రూకు ఇందిరాగాంధీ కూడా భిన్నం కాదని మోదీ అన్నారు. నెహ్రూ కంటే భిన్నంగా ఇందిరాగాంధీ ఆలోచించలేదని, ప్రజల శక్తి సామర్థ్యాలను సరిగా అంచనా వేయలేకపోయిందని అనిపిస్తుందని ప్రధాని తన ప్రసంగంలో కాంగ్రెస్‌పై నిశిత విమర్శలు చేశారు.

Updated Date - Feb 05 , 2024 | 09:27 PM

Advertising
Advertising