ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కశ్మీర్ అమ్మాయి రామభజనను ఎంత చక్కగా పాడిందో..ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

ABN, Publish Date - Jan 15 , 2024 | 07:24 PM

మర్యాద పురుషోత్తముడు రాముడు అనే మాట ఇప్పడు ప్రతినోటా మార్మోగుతోంది. రాముడు భారతదేశానికే కాదు.. ప్రపంచానికే దేవుడని జమ్మూకశ్మీర్ ముస్లిం నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండగా, ఉరి తహసిల్‌కు చెందిన 19 ఏళ్ల ముస్లిం యువతి సైద బతూల్ జెహ్రా ఏకంగా రామభజన 'పహరి' భాషలో పాడి శభాష్ అనిపించుకుంది.

శ్రీనగర్: మర్యాద పురుషోత్తముడు (Purushottam) రాముడు (Sriram) అనే మాట ఇప్పడు ప్రతినోటా మార్మోగుతోంది. రాముడు భారతదేశానికే కాదు.. ప్రపంచానికే దేవుడని జమ్మూకశ్మీర్ ముస్లిం నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండగా, ఉరి తహసిల్‌కు చెందిన 19 ఏళ్ల ముస్లిం యువతి సైద బతూల్ జెహ్రా (Syeda Batool Zehra) ఏకంగా రామభజన (Ram Bhajan) 'పహరి' (Pahari) భాషలో పాడి శభాష్ అనిపించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. జెహ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


ముస్లిం యువతిని అయినప్పటికీ రామ్ భజన్ పాడటంలో తనకు తప్పేమీ కనిపించ లేదని జెహ్రా సోమవారంనాడు కుప్వారాలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తాను పాడిన రామభజన వైరల్ కావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ''జుబిన్ నౌటియాల్ పాడిన ఒక పాటను యూట్యూబ్‌లో విన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ పాట హిందీలో ఉంది. పహరి భాషలో ఈ పాటను నేను ఎందుకు పాటకూడదని అనిపించింది. పహరి బాషలో పాట రాసుకుని పాడాను. దానిని రికార్డు చేసి మా మాస్టార్‌కు చూపించాను. ఆయన ఆ పాటను పోస్ట్ చేశారు. అది వెంటనే వైరల్ అయింది. ఇందుకు గాను ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఆయన కారణంగానే నెగిటివ్ ఆలోచనలు ప్రజల మనసుల నుంచి దూరమయ్యాయి. మా ముస్లిం సోదరులు సైతం నన్ను ఎంతగానో ప్రశంసించారు. మా ఇమామ్ హుస్సేన్ సైతం మహమ్మద్ ప్రవక్తను అనుసరించే వారు మాతృదేశాన్ని ప్రేమిస్తారని నాకు నేర్పించారు. నిజాయితీ, న్యాయానికి మారుపేరుగా నిలిచినందునే శ్రీరాముడు పురుషోత్తముడుగా అనిపించుకున్నారు'' అని జెహ్రా తెలిపింది.


మోదీ, ఎల్జీపై ప్రశంసలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హాపై జెహ్రా ప్రశంసలు కురిపించింది. ఎల్జీ హిందువు అయినప్పటికీ అభివృద్ధి పనుల విషయంలో తమ పట్ల ఎప్పుడూ వివక్ష చూపించలేదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అంతా సోదరులేనని తాను నమ్ముతానని, ఆ కారణంగానే జమ్మూకశ్మీర్ అభివృద్ధికి పాటుపడుతున్న ఎల్జీకి, ప్రధానికి సహకరించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆమె అన్నారు.

Updated Date - Jan 15 , 2024 | 07:30 PM

Advertising
Advertising