ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IRCTC: ఐఆర్‌సీటీసీ వినియోగదారులకు శుభవార్త.. గంటలోనే రిఫండ్ ఖాతాలో జమ?

ABN, Publish Date - Mar 13 , 2024 | 10:07 PM

ప్రస్తుతం చాలా మంది రైలు ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారానే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తుంటారు.

ప్రస్తుతం చాలా మంది రైలు ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారానే టికెట్ (Train Ticket) బుక్ చేసుకుంటున్నారు. ఐఆర్‌సీటీసీ (IRCTC) ద్వారా టికెట్ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి సాంకేతిక కారణాల వల్ల టికెట్ బుక్ అవకుండానే డబ్బులు మన ఖాతా నుంచి కట్ అయిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఐఆర్‌సీటీసీ ఆ డబ్బులను రిఫండ్ చేస్తుంది. అయితే ఆ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది (IRCTC Refund).

ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసే వారికి తరచుగా ఈ సమస్య ఎదురవుతుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఐఆర్‌సీటీసీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రిఫండ్ ప్రక్రియను ఐఆర్‌సీటీసీ వేగవంతం చేయనుంది. కొన్ని గంటల్లోనే రిఫండ్‌ను వినియోగదారుల ఖాతాల్లో జమ చేయనుంది. రిఫండ్ గురించి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలోనే ఈ సమస్యపై ఐఆర్‌సీటీసీ దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ సమస్యపై ఐఆర్‌సీటీసీ, దానికి ఐటీ సేవలందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రస్తుతం పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Mar 13 , 2024 | 10:07 PM

Advertising
Advertising