ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: కటిక పేదరికాన్ని జయించిన భారత్.. అమెరికా ఇన్‌స్టిట్యూషన్ ఆసక్తికర నివేదిక

ABN, Publish Date - Mar 02 , 2024 | 06:36 PM

ఏళ్లుగా భారత్(India) ఎదుర్కొంటున్న కటిక పేదరికాన్ని అధిగమించిందని అమెరికాకు చెందిన ఓ నివేదిక వెల్లడించింది. ఇందుకుగానూ భారత్ కృషిని అభినందిస్తూ ప్రశంసలు కురిపించింది. అమెరికన్ థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ తన తాజా నివేదిక ప్రకారం.. దేశం సామాజికంగా, ఆర్థికంగా కీలక మైలురాళ్లను చేరుకుందని.. అత్యంత పేదరికం నుంచి బయటపడిందని దాని సారాంశం.

ఢిల్లీ: ఏళ్లుగా భారత్(India) ఎదుర్కొంటున్న కటిక పేదరికాన్ని అధిగమించిందని అమెరికాకు చెందిన ఓ నివేదిక వెల్లడించింది. ఇందుకుగానూ భారత్ కృషిని అభినందిస్తూ ప్రశంసలు కురిపించింది. అమెరికన్ థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ తన తాజా నివేదిక ప్రకారం.. దేశం సామాజికంగా, ఆర్థికంగా కీలక మైలురాళ్లను చేరుకుందని.. అత్యంత పేదరికం నుంచి బయటపడిందని దాని సారాంశం.

ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, కరణ్ భాసిన్ దీనిని రూపొందించారు. భారత ప్రభుత్వ బలమైన నిర్ణయాలే ఈ విజయానికి కారణమని అందులో ఉంది. ఆర్థిక వృద్ధి, ఆదాయ అసమానతలు గణనీయంగా తగ్గించడం, కొనుగోలు శక్తిని పెంచడం ఇవన్నీ నివేదికలోని కీలక అంశాలు. 2011-12లో 12.2% పేదరికం ఉండగా.. 2022-23 నాటికి ఆ సంఖ్య 2 శాతానికి పడిపోయింది.


అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల లిస్టులో ఉండే జపాన్, యూకే ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న సమయంలో ఈ నివేదిక రావడం ఆసక్తికరంగా మారింది. జపాన్.. కరోనా మహమ్మారి కాలం నుంచి కోలుకోవడానికి కష్టపడుతోంది. కొవిడ్‌తో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కుంటోంది. దీంతో పెట్టుబడిదారులకు భారత్ ఇప్పడు నూతన గమ్యస్థానంగా మారింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం.. భారత్ ఆర్థిక వ్యవస్థ 2026 - 27 నాటికి జపాన్, జర్మనీ దేశాలను అధిగమించడానికి సిద్ధంగా ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2024 | 06:37 PM

Advertising
Advertising