Share News

West Bengal: బెంగాల్ బీజేపీకి ప్రధాని మోదీ పెద్ద టాస్క్.. ఏంటంటే

ABN , Publish Date - Mar 02 , 2024 | 03:17 PM

మమత సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని, నేరస్తులకు టీఎంసీ అడ్డాగా మారిందని ఆరోపిస్తూ ప్రధాని.. బీజేపీకి కీలక సూచనలు చేశారు. టీఎంసీ లోపాలను అడ్వాంటేజ్‌గా మార్చుకుంటూ రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ స్థానాల్లో బీజేపీ గెలుపుబావుటా ఎగరేయాలని ఆయన అన్నారు.

West Bengal: బెంగాల్ బీజేపీకి ప్రధాని మోదీ పెద్ద టాస్క్.. ఏంటంటే

కృష్ణానగర్: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ(TMC)పై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రధాని మోదీ(PM Narendra Modi).. రాష్ట్ర బీజేపీకి(BJP) బిగ్ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ నేతలే లక్ష్యంగా మోదీ శుక్రవారం జరిగిన సభలో నిప్పులు చెరిగారు. టీఎంసీ నేత, నేరారోపణలు ఎదుర్కుంటున్న సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ను సీఎం మమతా కాపాడుతోందని ప్రధాని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మమత సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని, నేరస్తులకు టీఎంసీ అడ్డాగా మారిందని ఆరోపిస్తూ ప్రధాని.. బీజేపీకి కీలక సూచనలు చేశారు. టీఎంసీ లోపాలను అడ్వాంటేజ్‌గా మార్చుకుంటూ రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ స్థానాల్లో బీజేపీ గెలుపుబావుటా ఎగరేయాలని ఆయన అన్నారు.

బెంగాల్‌లో 42 లోక్ సభ స్థానాలను గెలవాలని బీజేపీకి లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రణాళికబద్ధంగా, నేతలందరూ ఏకతాటిపై నడుస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది ఎలాగైనా దీదీని గట్టి దెబ్బ కొట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.


టీఎంసీకి కొత్త అర్థం..

తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త అర్థం చెప్పారు. టీఎంసీ హయాంలో నేరాలు, అవినీతి పరిఢవిల్లుతోదందని చెబుతూ.. టీఎంసీ అంటే ''తూ, మై, కరప్షన్'' (Tu, Mei, Corruption) అని నిర్వచించారు. రాష్ట్రంలో రూ.15,000 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రధాని శనివారం ప్రారంభించారు. రూ.940 కోట్లతో నాలుగు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో బెంగాల్ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని చెప్పారు.

టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని.. ప్రజలు పదేపదే టీఎంసీని భారీ మెజారిటీతో గెలిపిస్తూ వచ్చినప్పటికీ అకృత్యాలు, మోసాలకు పర్యాయపదంపై ప్రభుత్వం మారిందన్నారు. టీఎంసీ అంటే వంచన, అవినీతి, పరివార్‌వాద్ అని విమర్శించారు. బెంగాల్‌కు తొలి ఎయిమ్స్‌ గ్యారెంటీని తమ ప్రభుత్వం ఇచ్చిందని, కల్యాణిలో కొద్దిరోజుల క్రితం ఎయిమ్స్‌ను వర్చువల్ తరహాలో ప్రారంభిచానని చెప్పారు. అయితే పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి మాత్రం పర్యావరణ క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పారు. కమిషన్లు ఇవ్వకుంటే టీఎంసీ ప్రభుత్వం అన్ని పర్మిషన్లు రద్దు చేస్తుందని, మొదట కమిషన్, ఆ తర్వాతే పర్మిషన్‌ అని విమర్శించారు. మమత ప్రభుత్వం ప్రతి స్కీమ్‌ను స్కామ్‌గా మారుస్తోందని ఆరోపించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2024 | 03:17 PM