ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress vs BJP: హనుమాన్ జెండా తొలగింపు, తీవ్ర ఉద్రిక్తత

ABN, Publish Date - Jan 29 , 2024 | 03:42 PM

హనుమాన్ జెండా తొలగించడం కర్ణాటకలోని మాండ్యలో రాజకీయ ఉద్రిక్తతలు, నిరసనలకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కెరగోడు గ్రామంలో ఒక వర్గానికి చెందిన కొందరు 108 అడుగుల ఫ్లాగ్‌పోల్ ఏర్పాటు చేసి, హనుమంతుడి జెండా ఎగురవేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

మాండ్య: హనుమాన్ జెండా (Hanuman Flag) తొలగించడం కర్ణాటక (Karnataka) లోని మాండ్య (Mandya)లో రాజకీయ ఉద్రిక్తతలు, నిరసనలకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కెరగోడు గ్రామంలో ఒక వర్గానికి చెందిన కొందరు 108 అడుగుల ఫ్లాగ్‌పోల్ ఏర్పాటు చేసి, హనుమంతుడి జెండా ఎగురవేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంతో మారడంతో గ్రామంలో 144 సెక్షన్ విధించారు.


ఘటన వివరాల ప్రకారం, ఫ్లాగ్ పోల్ ఏర్పాటుకు గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై ఫిర్యాదులు రావడంతో హనుమాన్ జెండాను తొలగించాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనిని గ్రామస్థులు వ్యతిరేకించారు. కొద్ది మంది వ్యక్తులు దీనిని రాజకీయం చేయాలనుకుంటున్నారని వారు విమర్శించారు. వారికి బీజేపీ, జేడీఎస్, బజ్‌‍రంగ్‌దళ్ కార్యకర్తలు మద్దతు తెలుపుతూ నిరసనలు దిగారు. గత శనివారంనాడు ఈ నిరసలు తీవ్రరూపం దాల్చాయి. స్థానికులు దుకాణాలు మూసాశారు. జెండాను తొలగించేందుకు గ్రామపంచాయితీ అధికారులు అక్కడకు చేరుకోగానే స్థానికులు ''గో బ్యాక్'' నినాదాలు హోరెత్తించారు. కొందరు నిరసనకారులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ బ్యానర్లను ధ్వంసం చేయడంతో మొత్తం వ్యవహారం రాజకీయరూపు సంతరించుకుంది. దీంతో భారీగా పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు.


బీజేపీ ఖండన

హనుమాన్ జెండాను తొలగించడాన్ని బీజేపీ నేతలు, హిందూ కార్యకర్తలు ఖండించారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో నిరసనలు నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది. కాగా, పరిస్థితిని చక్కదిద్దేందుకు హనుమాన్ జెండా స్థానంలో జాతీయ జెండాను పోలీసులు ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకత విధానాలకు పాల్పడుతోందని బీజేపీ నేత ఆర్.అశోక విమర్శించారు. గ్రామ పంచాయతీ ఆమోదంతోనే హనుమాన్ జెండా ఏర్పాటు చేశామని, దానిని తొలగించాలని కాంగ్రెస్ ఎందుకు నిర్ణయం తీసుకుందని ఆయన ప్రశ్నించారు.


సీఎం సిద్ధరామయ్య స్పందన..

కాగా, తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ పతాకానికి బదులుగా భగవధ్వజం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. జాతీయజెండా ఎగురవేయాలని అధికారులకు సూచించడం జరగిందని చెప్పారు. దీనిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్.చెలువరాయస్వామి వివరణ ఇస్తూ, పంచాయతీ పరిధిలో ఫ్లాగ్ పోల్ ఏర్పాటైందని, రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయడానికి అనుమతి తీసుకున్నారని చెప్పారు. అయితే ఆ స్థానే హనుమాన్ జెండా ఎగురవేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజ్యంగ ప్రకారం దేశం పనిచేస్తుందని, ఇవాళ వేరే జెండా ఎగురవేసిన వాళ్లు రేపు డీసీ కార్యాలయం ముందుకు ఎగురవేయాలనుకుంటున్నామని చెబుతారని, అందుకు అనుమతించాలా అని ప్రశ్నించారు. ఒక ప్రదేశంలో అనుమతిస్తే ఇతర ప్రాంతాలకు కూడా దానిని విస్తరిస్తూ పోతారని అన్నారు. యువకుల మనోభావాలను గాయపరచడం తమ ఉద్దేశం కాదన్నారు. హనుమాన్ జెండా ప్రైవేటు స్థలంలో కానీ, ఆలయం సమీపంలో కానీ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు, పోలీసులు, యువకులకు తాను సూచించానని, ఇందుకు తమ మద్దతు కూడా ఉంటుందని చెప్పారు. తాము కూడా రామభక్తులమేనని ఆయన అన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 03:42 PM

Advertising
Advertising