ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chief Minister: సీఎం గారొస్తున్నారోచ్‌..! స్టాలిన్‌ వాకింగ్‌ కోసం పార్కులో జోరుగా మరమ్మతులు

ABN, Publish Date - Mar 29 , 2024 | 09:07 AM

ఎన్నికల ప్రచారం కోసం మదురైకి వెళుతున్న డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) వాకింగ్‌ కోసం అక్కడి పార్కులో శరవేగంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

చెన్నై: ఎన్నికల ప్రచారం కోసం మదురైకి వెళుతున్న డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) వాకింగ్‌ కోసం అక్కడి పార్కులో శరవేగంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ నెల 22న లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన స్టాలిన్‌ ఈ నెల 9న మదురై, శివగంగ అభ్యర్థులకు మద్దతుగా మదురైలో ప్రచారం చేయనున్నారు. ఆ రోజు రాత్రి ఆయన మదురైలో బస చేయనున్నారు. మరుసటి రోజు తేని, దిండుగల్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి తేనికి బయలుదేరి వెళ్లనున్నారు. ఆ సందర్భంగా 10వ తేది ఉదయం స్టాలిన్‌ మదురై కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరువగా ఉన్న పార్కులో వాకింగ్‌ చేయనున్నట్లు డీఎంకే స్థానిక శాఖ నాయకులు కార్పొరేషన్‌ అధికారులకు తెలిపారు. దీంతో చెత్తాచెదారం ముళ్ల పొదలతో నిండి ఉన్న ఆ పార్కును కార్పొరేషన్‌ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. ఏప్రిల్‌ 9వ తేదీలోగా ఆ పార్కు కొత్త సొబగులు సంతరించుకుంటుందని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 09:07 AM

Advertising
Advertising