ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MK Stalin: చైనా భాషలో స్టాలిన్‌కు బీజేపీ బర్త్‌డే శుభాకాంక్షలు

ABN, Publish Date - Mar 01 , 2024 | 05:44 PM

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కు బీజేపీ వినూత్న రీతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. చైనా భాష 'మాండరిన్'లో ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పింది.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin)కు బీజేపీ (BJP) వినూత్న రీతిలో శుక్రవారంనాడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. చైనా భాష 'మాండరిన్' (Mandarin)లో ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పింది. ''గౌరవనీయులైన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆయనకు ఇష్టమైన బాషలో తమిళనాడు బీజేపీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం'' అంటూ 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేసింది.


వివాదం ఇదే..

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) రెండో లాకెట్ లాంచ్ ప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28న దీనికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి ఇచ్చిన ఒక ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఇందులో మోదీ, స్టాలిన్ ఫోటోలతో పాటు ఇస్రో రాకెట్‌కు చైనా జెండా రంగులు ఉండటం వివాదానికి కారణమైంది. దీనిపై మోదీతో పాటు, బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అంతరిక్ష రంగంలో భారత విజయాలను ప్రపంచానికి చాటేందుకు డీఎంకేకు ఇష్టపడటం లేదని, మన శాస్త్రవేత్తలను, మన అంతరిక్ష కేంద్రాన్ని కూడా విమర్శిస్తున్నారని మోదీ తప్పుపట్టారు. వాళ్లు చేసిన తప్పదాలకు శిక్ష విధించే సరైన సమయం ఇదేనని అన్నారు. దీంతో డీఎంకే డిఫెన్స్‌లో పడింది. డీఎంపీ కనిమొళి ఆ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. చైనా మన శత్రుదేశమని భారత్ ప్రకటించినట్టు తనకు గుర్తులేదన్నారు. మోదీ చైనా ప్రధానిని భారత్‌కు ఆహ్వానించి, ఇద్దరూ కలిసి మహాబలిపురం వెళ్లారని, నిజాన్ని ఒప్పుకునేందుకు మోదీ సిద్ధంగా లేనందునే సమస్యను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం స్టాలిన్ 72వ పుట్టినరోజు సందర్భంగా చైనా భాషలోనే ఆయనకు బీజేపీ శుభాకాంక్షలు చెప్పింది.

Updated Date - Mar 01 , 2024 | 05:46 PM

Advertising
Advertising