ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు 5 రోజుల విరామం.. కారణమిదే

ABN, Publish Date - Feb 21 , 2024 | 11:40 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు బ్రేక్ పడింది. ఈ యాత్ర ఐదు రోజుల పాటు నిలిపివేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay yatra)కు బ్రేక్ పడింది. ఈ యాత్ర ఐదు రోజుల పాటు నిలిపివేశారు. అంటే ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు విరామం ఉంటుందని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సమావేశాలను ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు రాహుల్ గాంధీ హాజరుకావాల్సిన అవసరం ఉందని జైరాం రమేష్ అన్నారు. దీంతో పాటు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో రాహుల్ గాంధీ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. రాహుల్ అక్కడ రెండు ఉపన్యాసాలు ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Fali S Nariman: సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ కన్నుమూత


ఆ క్రమంలో భారతదేశానికి రాహుల్ తిరిగి వచ్చిన తర్వాత మార్చి 2 నుంచి యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. మార్చి 5న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ పర్యటన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఉంది. ఈరోజు (ఫిబ్రవరి 21, 2024) అతని ప్రయాణంలో 39వ రోజు. యూపీలో ఆయన పర్యటన ఇది ఆరో రోజు. భారత్ జోడో న్యాయ యాత్ర నేడు లక్నోలోని బంత్రా నుంచి ఉన్నావ్‌లోకి ప్రవేశించనుంది. ఇక్కడ గంటన్నరలో దాదాపు 13 కిలోమీటర్ల మేర రాహుల్ రోడ్ షో చేయనున్నారు. ఆ తర్వాత యూపీలోని కాన్పూర్‌లోకి ప్రవేశిస్తారు. నిన్న రాయ్‌బరేలీలో ఉన్న ఆయనకు నల్లజెండాలు చూపించిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.

Updated Date - Feb 21 , 2024 | 12:11 PM

Advertising
Advertising