ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం..44 మంది మృతి

ABN, Publish Date - Mar 01 , 2024 | 06:52 AM

గురువారం అర్థరాత్రి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం(fire accident) జరిగింది. బెయిలీ రోడ్‌లోని ఏడంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 44 మంది చనిపోయారు.

మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్(bangladesh) రాజధాని ఢాకా(dhaka)లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం(fire accident) సంభవించింది. దీంతో ఇప్పటివరకు 44 మంది మరణించగా..మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢాకాలోని అనేక రెస్టారెంట్లు ఉన్న బెయిలీ రోడ్‌లోని ఏడంతస్తుల వాణిజ్య భవనంలో గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు 13 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించింది.

ఈ క్రమంలో గ్రీన్ కోజీ కాటేజ్ పేరుతో ఉన్న భవనం నుంచి 75 మందిని ఖాళీ చేయించారు. వీరిలో 42 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. అందరినీ ఢాకా(dhaka) మెడికల్ కాలేజీ, షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీలో చేర్చారు. అక్కడ 44 మంది చనిపోయారు.


గురువారం రాత్రి 9:50 గంటలకు మొదటి అంతస్తులోని రెస్టారెంట్‌లో మంటలు ప్రారంభమై త్వరగా పై అంతస్తులకు వ్యాపించాయని బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో గాయపడిన క్షతగాత్రులు రెండు ఆసుపత్రుల్లో(Hospitals) చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కొందరి మృతదేహాలు బాగా కాలిపోయాయని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. వారి గుర్తింపు కష్టమని, మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Satellites Collide: అంతరిక్షంలో తప్పిన భారీ ప్రమాదం.. రెండు శాటిలైట్స్ అత్యంత సమీపానికొచ్చి..


Updated Date - Mar 01 , 2024 | 06:52 AM

Advertising
Advertising