Regi Pandu: రేగు పండు.. దీనిలో ఏముంటుంది అని అనుకోవద్దు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..
ABN, Publish Date - Dec 01 , 2024 | 02:15 PM
సీజనల్‌లో దొరికే పండ్లను అస్సలు మిస్ కావొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో దొరికే రేగుపండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి.
రేగిపండు.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక పోషకాలతో నిండిన ఈ రేగి పండ్లని తినడం వల్ల భయంకరమైన కాన్సర్ కారకాలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే, సీజనల్‌లో దొరికే పండ్లను అస్సలు మిస్ కావొద్దని అంటారు.
ఆరోగ్య ప్రయోజనాలు..
చలికాలంలో దొరికే రేగుపండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో ఈ రేగుపండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. రేగు పండ్ల వలన రక్త హీనత సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్నా ఈ రేగు పండ్లు శరీరానికి చాలా అవసరం. ఇక ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలు దృఢంగా వుండేందుకు సహాయపడుతాయి. అంతేకాకండా, ఈ పండ్లను తినడం వల్ల ఆర్థరైటిస్ సమస్య కూడా దూరం అవుతుంది. కీళ్లకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే ఎంతో మంచిది. రేగిపండులో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువ కాబట్టి ఒత్తిడి తగ్గించడంలోనూ బాగా పనిచేస్తాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచి యవ్వనంగా ఉంచుతుంది. చర్మం ముడతలు పడకుండా తగ్గిస్తుంది. అంతేకాకుండా మల బద్ధకం ఉన్నవారికి కూడా ఈ రేగిపండు చాలా మంచిది.
18 రకాలు..
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ రేగు పండ్లు మంచి ఆహారం. ఇవి ఎన్ని తిన్నా అస్సలు బరువు పెరగరు. ఇందులో కొవ్వు ఉండదు. దీనిలో ఉండే కెలరీలు చాలా తక్కువ కాబట్టి శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. మనిషి శరీరానికి అవసరమైన 24 రకాల అమైనో ఆమ్లాలలో 18 రకాలు ఒక్క రేగు పండ్లలోనే లభిస్తాయిని నిపుణలు చెబుతున్నారు. ఈ రేగిపండు తింటే కడుపులో మంట, ఆజీర్తి, గొంతునొప్పి, కండరాల నొప్పి తగ్గుతాయి. అంతేకాకండా గర్భిణుల్లో ఉండే వికారాలను వాంతులను ఈ రేగి పండు తగ్గిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటకి పంపి ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పండ్లు దోహదపడుతాయి. కాబట్టి, వయస్సుతో సంబంధం లేకుండా ఏ సీజన్లో దొరికె పళ్ళు ఆ సీజన్లో తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN న్యూస్ దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)
Updated Date - Dec 01 , 2024 | 02:26 PM