Upma: ఉప్మానే కదా అని తీసిపడేయకండి.. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుస్తే షాక్ అవుతారు..
ABN, Publish Date - Nov 25 , 2024 | 04:29 PM
ఉప్మా అంటేనే కొంతమంది ఆమడ దూరం పారిపోతారు. టిఫిన్ చేయడం అయినా మానేస్తారు కానీ ఉప్మాను మాత్రం అస్సలు తినరు. అయితే, ఉప్మాను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు.
Upma: ఉప్మా అంటేనే కొంతమంది ఆమడ దూరం పారిపోతారు. ఇంతకు ముందు ఉదయం టిఫిన్ గా చాలా మంది ఉప్మానే తినేవారు. కానీ, ఇప్పుడు కేవలం ఇడ్లీ, పూరీ వంటి టిఫిన్లు మాత్రమే తింటున్నారు. టిఫిన్ చేయడం అయినా మానేస్తారు కానీ ఉప్మాను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తినరు. మరీ ముఖ్యంగా హాస్టల్ లోని పిల్లలు ఉప్మాను అస్సలు తినరు. అయితే, ఉప్మాను తినడం చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..
జీర్ణ క్రియ సమస్యలు..
ఉప్మాను తింటే సాఫీగా జీర్ణం అవుతుంది. అలాగే, జీర్ణ సమస్యలను కూడా ఉప్మా మెరుగు పరుస్తుంది. దీంతో కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. మల బద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది.
బరువు తగ్గొచ్చు..
ఉప్మాను మంచి డైట్ ఫుడ్ గా తీసుకోవచ్చు. రోజులో ఒకసారి ఉప్మా తిన్నా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఉప్మాలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి ఇతర ఆహార పదార్థాలు తీసుకోలేం. ఉప్మా ఈ విధంగా కూడా ఉపయోగ పడుతుంది.
ఎముకలు గట్టి పడతాయి:
ఉప్మా తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉప్మాలో సాధారణంగా కూరగాయలు ఉపయోగిస్తారు కాబట్టి.. ఇది తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి.
రోగ నిరోధక శక్తి..
ఉప్మాలో ఉండే ఆహార పదార్థాల వల్ల బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్ గా వచ్చే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత పడొచ్చు. జలుబు, జ్వరం వంటివి ఉన్నప్పుడు ఉప్మా తింటే చాలా మంచిదని ఇమ్యూనిటీ పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
అన్ని పోషకాలు..
ఉప్మాలో ఉపయోగించే ఇంగ్రీడియన్స్ వల్ల అన్ని పోషకాలు లభిస్తాయి. అల్లం, క్యారెట్, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, కొత్తి మీర, ఉల్లిపాయ, టమాటా, పల్లీలు, పచ్చి మిర్చి వీటి వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అందుతాయి.
ప్రోటీన్స్ ఎక్కువ:
ఉప్మాలో ఉపయోగించే వాటిల్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. కాబట్టి ఉప్మాను తినడం వల్ల లాభాలే కానీ ఏలాంటి నష్టాలు లేవు.
(Note: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.)
Also Read: మేనరికాలు, బావా-మర్ధళ్ల పెళ్ళిళ్లు చాలా డేంజర్.. సైన్స్ చెబుతున్న షాకింగ్ నిజాలు..
Updated Date - Nov 25 , 2024 | 04:29 PM