Liver Health: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..
ABN, Publish Date - Nov 01 , 2024 | 10:12 PM
మన శరీరంలో కాలేయం ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలేయం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియకు సహాయం చేయడం మాత్రమే కాకుండా జీవక్రియను అదుపులో ఉంచడం వంటి చాలా పనులను చేస్తుంది. ఆ అవయవం ఆరోగ్యంగా ఉంటే మనం సేఫ్‌గా ఉంటాం.
Health Tips: మన శరీరంలో కాలేయం ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలేయం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియకు సహాయం చేయడం మాత్రమే కాకుండా జీవక్రియను అదుపులో ఉంచడం వంటి చాలా పనులను చేస్తుంది. ఆ అవయవం ఆరోగ్యంగా ఉంటే మనం సేఫ్‌గా ఉంటాం. లేదంటే ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటి? దాని ఆరోగ్యం కోసం మనం ఏ ఆహారాలను తీసుకోవాలి? కీలక వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
వెల్లుల్లి:
వెల్లుల్లి.. వంటలకు మంచి రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. పూర్వంలో అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా వెల్లుల్లిని ఉపయోగించేవారు. వెల్లుల్లి తింటే లివర్ పనితీరు మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
క్యాబేజీ:
క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ వంటివి ఉంటాయి. అయితే దీనిని చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ కాలేయానికి క్యాబేజీ మంచి ఆహారం అని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
పుచ్చకాయ:
పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో సహాయపడతాయని తెలుస్తుంది. కాలేయంలో ఏదైనా లోపం ఉంటే, పుచ్చకాయ తినడం ద్వారా సకాలంలో భర్తీ చేయవచ్చని వైద్యులు అంటున్నారు.
నువ్వులు:
నువ్వులలో ప్రోటీన్, విటమిన్ ఇ తోపాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇది కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దాని సామర్థ్యాన్ని పెంచుతుంది.
దోసకాయ:
దోసకాయ కాలేయ ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఎందుకంటే దోసకాయలలోని అధిక నీటి శాతం, యాంటీ ఆక్సిడెంట్లు కాలేయం టాక్సిన్స్‌ని త్వరగా తొలగించడంలో సహాయపడుతాయి. దోసకాయ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Also Read:
ఈ ఫొటోలోని మూడు ముఖ్యమైన తేడాలు ఏంటి?
పులి vs ఎలుగుబంటి.. ఎదురుపడితే..
అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చిన సింహాలు.. చివరకు జరిగింది చూస్తే..
For More Health News and Telugu News
Updated Date - Nov 01 , 2024 | 10:12 PM