Coriander: కొత్తిమీరే కదా అని తీసి పారేయకండి.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
ABN, Publish Date - Nov 30 , 2024 | 02:18 PM
కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎన్నో ప్రోటీన్స్, విటమిన్లు ఉంటాయి. దీనిని రెగ్యులర్‌గా మన మెనూలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం..
Coriander: కొత్తిమీర.. ఈ ఆకులని ఏ కూరల్లో అయినా చివరిసారిగా ఫైనల్ టచ్ ఇవ్వాలని వేస్తుంటారు. గార్నిషింగ్‌గా కూడా కొత్తమీరను వాడతారు. అయితే, ఈ ఆకుల్లో ఎన్నో అదనపు లాభాలున్నాయి. అవేంటో మీరూ చూడండి.. కొత్తిమీరలో ఎన్నో ప్రోటీన్స్, విటమిన్లు ఉంటాయి. దీనిని రెగ్యులర్‌గా మన మెనూలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.
కొత్తిమీరతో కలిగే ప్రయోజనాలు:
1. బరువు తగ్గించడం..
బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు కొత్తిమీర నీళ్లు తాగితే ఎంతో మంచిది. కొత్తిమీరను నీటిలో వేసి మరిగించి దానిని ఫిల్టర్ చేసుకుని ఆ నీటిని తాగితే బరువు తగ్గుతారు. దీన్ని రోజుకు రెండుసార్లు తాగాలి.
2. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది..
కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కొత్తిమీర నీరు తీసుకోవడం మంచిది.
3. ఉదర వ్యాధులకు దివ్యౌషధం
కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొత్తిమీర నీరు చాలా మంచి చేస్తుంది. కొత్తిమీర నీరు తాగితే కడుపు నొప్పి నుంచి కాస్తా ఉపశమనం పొందుతారు. అసిడిటీ సమస్య ఉన్నవారు కొత్తిమీరతో పాటు జీలకర్ర, టీ ఆకులు, పంచదార వేసి ఉడికించి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ నీటిని తాగడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. మధుమేహనికి మేలు..
కొత్తిమీర నీరు డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నీరు తాగడం వల్ల రక్తంలో ఇన్సులిన్ పరిమాణం సరిగ్గా ఉంటుంది. ఈ కారణంగా మధుమేహం నుంచి ఉపశమనం కలుగుతుంది.
5. కళ్లకు విశ్రాంతి..
కళ్ల మంటలు, కళ్లలో నీళ్లు కారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి కొత్తిమీర నీరు మంచి చేస్తుంది. కొన్ని కొత్తిమీర గింజలను నీటిలో మరిగించి.. తర్వాత నీటిని చల్లార్చి మందపాటి గుడ్డతో వడకట్టి కళ్లలో రెండు చుక్కలు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల మంటల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
6. పీరియడ్స్ కు ఔషధం
పీరియడ్స్ సమస్యలతో మహిళలు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి కొత్తిమీర ఔషధంగా పనిచేస్తుంది. సమయానికి పీరియడ్స్ రాని వారు కొత్తిమీర నీళ్లలో కొంచెం పంచదార కలిపి తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
(Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలుగా, సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABN దీనిని ధృవీకరించలేదు.)
Updated Date - Nov 30 , 2024 | 02:19 PM