ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Coffee: ఉదయాన్నే కాఫీ తాగే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే..!

ABN, Publish Date - Feb 24 , 2024 | 05:21 PM

చాలామందికి ఉదయాన్నే కాఫీ తాగందే ఓ పనులు మొదలు పెట్టే అలవాటు ఉండదు. ఇలా తాగితే ఏం జరుగుతుందంటే..

కాఫీ ఓ మంచి ఎనర్జీ డ్రింక్ అని చెప్పవచ్చు. చాలామందికి ఉదయాన్నే కాఫీ తాగందే ఓ పనులు మొదలు పెట్టే అలవాటు ఉండదు. కొందరు తలనొప్పిగా అనిపించినా, నీరసంగా ఉన్నా కాఫీ తాగి రిలాక్స్ అవుతారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఎంతవరకు మంచిది అనే విషయం గురించి అడపాదడపా చర్చలు సాగుతుంటాయి. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల నష్టాలుంటాయని ఆహరనిపుణులు అంటున్నారు. కాఫీని ఉదయాన్నే తాగడం వల్ల కలిగే నష్టాలేంటి? ఓ లుక్కేస్తే..

ఆందోళన..

కెఫిని్ ఉద్దీపన చెందిస్తుంది. చురుగ్గా ఉండటంలో తోడ్పడుతుంది. కాఫీలో కెఫీన్ కంటెంట్ బాగుంటుంది. ఉదయాన్నే ఖాలీ కడుపుతో కాఫీని తాగితే అది ఆందోళన సమస్యకు దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: టాయిలెట్ లోకి మొబైల్ తీసుకెళ్తుంటారా? మీకు తెలియని నిజాలివీ..!


యాసిడ్లు..

కాఫీ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. కెఫీన్ ఎక్కువగా ఉండటం, ఆమ్ల స్వభావం కలిగి ఉండటం రెండింటి వల్ల కాఫీని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే అది క్రమంగా పెస్టిక్ అల్సర్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది జీర్ణాశయ సమస్యలకు కూడా కారణం అవుతుంది.

జీర్ణ సమస్యలు..

ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటి జీర్ణసంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఖాళీ కడుపుతో కాఫీని అస్సలు తాగకూడదు. ఇది జీర్ణ సంబంధ సమస్యలు, విరేచనాలు, పొత్తి కడుపు తిమ్మిరి మొదలైన సమస్యలను కలిగిస్తుంది.

పోషకాల శోషణ..

కాఫీలో టానిన్లు ఉంటాయి. ఇవి ఐపన్, కాల్షియంతో సహా కొన్ని రకాల ఖనిజాలు, విటమిన్లు, పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల రోజులో తీసుకునే ఆహారంలో పోషకాలు శరీరానికి అందడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇది కాలక్రమేణా పోషకాహార లోపానికి దారితీస్తుంది.

ఒత్తిడి..

అడ్రినల్ గ్రంధుల నుండి ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ విడుదల అవుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఈ హార్మోన్ ఎక్కువ విడుదల అయ్యి ఒత్తిడి స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.

చక్కెర స్థాయిలు..

కెఫిన్ ఉదయాన్నే తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని, గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగేలా చేస్తుంది. చక్కెర స్థాయిలు క్రాష్ అవ్వడానికి దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: జీవితాన్ని అందంగా మార్చే 8 అలవాట్లు ఇవీ..!

డీహైడ్రేషన్..

కెఫిన్ మూత్రం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. శరీరంలో తేమ శాతం కోల్పోవడానికి దారితీస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యేలా చేస్తుంది. ఇది తలనొప్పి, మైకం, అలసట వంటి సమస్యలు సృష్టిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2024 | 05:22 PM

Advertising
Advertising