ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Body Detox: బాబా రాందేవ్ చెప్పిన ఈజీ ప్రాసెస్... శరీరాన్ని శుద్ది చేయడానికి ఈ పద్దతి ఎంత పవర్ఫుల్ అంటే..

ABN, Publish Date - Feb 28 , 2024 | 08:41 AM

రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో మలినాలు, విషపదార్థాలు పేరుకుపోతుంటాయి. వాటిని తొలగించడానికి ఇది మంచి చిట్కా..

ఆరోగ్యమైన జీవితానికి శరీరం శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. శుభ్రత అంటే కేవలం పైన శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కాదు. అంతర్గత శరీరం శుభ్రంగా ఉండటం. సాధారణంగా రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో మలినాలు, విషపదార్థాలు పేరుకుపోతుంటాయి. ఇలా పేరుకు పోవడం వల్ల శరీర పనితీరు నెమ్మదిస్తుంది. ముఖ్యంగా చర్మం, రక్తం చాలా కలుషితం అవుతాయి. వీటిని శుద్ది చేసుకోవడానికి చాలా డిటాక్స్ పద్దతులు ఉంటాయి. అయితే ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చెప్పిన ఈజీ పద్దతిని అనుసరిస్తే శరీరాన్ని చాలా సులువుగా డిటాక్స్ చెసుకోవచ్చు. ఇందుకోసం కావలసిన పదార్థాలు.. దీన్ని ఎలా చేసుకోవాలి? పూర్తీగా తెలుసుకుంటే..

శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడానికి బాబా రాందేవ్ తులసిని అత్యుత్తమంగా పేర్కొన్నారు. తులసి ఆకుల రసం తీసుకున్నా, తులసి గింజలు తీసుకున్నా శరీరంలో పేరుకున్న విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో తులసి గింజలు వేయాలి. ఇందులో కొన్ని నిగెల్లా విత్తనాలు లేదా కలోంజి విత్తనాలు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి.

ఇది కూడా చదవండి: పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులివీ..!


ఇది శరీరంలో మురికిని, మలినాలను, శరీరంలో పేరుకున్న విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఇక తులసి గింజలైనా, ఆకులైనా, వాటి పొడి అయినా కఫం, వాతం దోషాలను తగ్గించడంలోనూ.. జీర్ణశక్తని, ఆకలిని పెంచడంలోనూ, రక్తాన్ని శుద్ది చేయడంలోనూ అద్భుతంగా సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: బరువు తగ్గడానికి జీరో కేలరీల ఆహారాలివే..!

మరిన్ని ఆరోగ్యవార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 28 , 2024 | 08:41 AM

Advertising
Advertising