పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులివీ..!

తల్లిదండ్రులు కొన్ని పనులు చేయడం వల్ల పిల్లలు చెడిపోతారు. నిర్లక్ష్యంగా, మొండిగా తయారవుతారు.

పిల్లల ముందు ఎట్టిపరిస్థితిలో అబద్దాలు చెప్పకూడదు. తల్లిదండ్రులు అబద్దాలు చెబితే.. అది తప్పేం కాదనే  మెంటాలిటీ పిల్లలలో అభివృద్ది చెందుతుంది.

పిల్లల ముందు తల్లిదండ్రులు వాదించడం, గొడవ పడటం చేయకూడదు. అది చూసి పిల్లలు కూడా అన్నింటికీ గొడవ పడటం నేర్చుకుంటారు.

తల్లిదండ్రులు శుభ్రత పాటించకపోతే పిల్లలు కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. పరిశుభ్రతకు దూరం ఉంటారు.

పిల్లల ముందు ఎవ్వరిపైనా చెయ్యి ఎత్తకూడదు.   లేకుంటే పిల్లలు కూడా చెయ్యి ఎత్తడం, కొట్టడం తప్పు కాదనే భావనలోకి జారుకుంటారు.

ఇంట్లో వారు కానీ, పిల్లలు కానీ తప్పు పనులు చేసినప్పుడు దాన్ని తల్లిదండ్రులు సమర్ధించకూడదు.  లేకపోతే పిల్లలకు తప్పొప్పుల మధ్య వ్యాత్యాసం తెలియకుండా పోతుంది.

ఇతరులను చులకనగా మాట్లాడటం, ఎగతాళి చేయడం, డబ్బు విషయంలో అహంకారం చూపించడం చేయకూడదు. లేకపోతే పిల్లలు కూడా అహంకారంగా తయారవుతారు.