ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jio Recharge Free: ముకేశ్ బర్త్ డే, అంబానీ కుమారుడి పెళ్లి నేపథ్యంలో జియో రీఛార్జ్ ఫ్రీ..క్లారిటీ

ABN, Publish Date - Mar 11 , 2024 | 11:16 AM

దేశంలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఏప్రిల్లో ముఖేష్ అంబానీ పుట్టినరోజు, అనంత్-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక జూలై 12న జరగనుంది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.

దేశంలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ(Mukesh ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటివల తన కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఏప్రిల్లో ముఖేష్ అంబానీ పుట్టినరోజు, అనంత్-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక(wedding) జూలై 12న జరగనుంది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.

అంబానీ బర్త్ డే, అనంత్ పెళ్లి వేడుక నేపథ్యంలో జియో నుంచి 259 రూపాయల రీఛార్జ్‌ను ఉచితం(Jio recharge free)గా అందించారని, ఇది 30 రోజులపాటు ఉంటుందని పేర్కొంటూ ఒక పోస్ట్ లింక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉచిత రిఛార్జ్ ఆఫర్ కోసం ఆ లింక్ క్లిక్ చేయాలని పలువురు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. బర్త్ డే, పెళ్లి వేడుకల నేపథ్యంలో జియో కంపెనీ భారతీయ వినియోగదారులందరికీ ఈ ఆఫర్ అందిస్తుందని సోషల్ మీడియా(social media)లో ప్రచారం చేస్తున్నారు. జియో కంపెనీ భారతీయ వినియోగదారులందరికీ ఈ ఆఫర్ ప్రకటించిందని, మరో మూడు రోజుల్లో ఇది ముగుస్తుందని పలువురు చెబుతున్నారు.


అయితే ఈ అంశం గురించి ఫాక్ట్ చేక్ చేయగా ఫేక్ అని తేలింది. దీంతోపాటు అధికారిక వెబ్‌సైట్ Jio.comలో చూసినా కూడా అలాంటి ఆఫర్ ప్రకటించలేదు. అంబానీ బర్త్ డే, ముఖేష్ కుమారుడి పెళ్లి ఉచిత రీఛార్జ్ గురించి ఎలాంటి సమాచారం(information) అందుబాటులో లేదు. దీంతో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్న సందేశాలు నకిలీవని తేల్చేశారు. వాటిని సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. అలాంటి వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ‘ఈఎ్‌ఫటీఏ’తో స్వేచ్ఛా వాణిజ్య బంధం

Updated Date - Mar 11 , 2024 | 11:16 AM

Advertising
Advertising