Share News

‘ఈఎ్‌ఫటీఏ’తో స్వేచ్ఛా వాణిజ్య బంధం

ABN , Publish Date - Mar 11 , 2024 | 03:03 AM

ఐస్‌లాండ్‌, లీచ్‌టెన్‌స్టీన్‌, నార్వే, స్విట్జర్లాండ్‌ దేశాలతో కూడిన యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఈఎఫ్‌టీఏ)తో భారత్‌ కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద...

‘ఈఎ్‌ఫటీఏ’తో స్వేచ్ఛా వాణిజ్య బంధం

రూ.8.28 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ.. కొత్తగా 10 లక్షల కొలువులు

న్యూఢిల్లీ: ఐస్‌లాండ్‌, లీచ్‌టెన్‌స్టీన్‌, నార్వే, స్విట్జర్లాండ్‌ దేశాలతో కూడిన యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఈఎఫ్‌టీఏ)తో భారత్‌ కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో 10,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.8.28 లక్షల కోట్లు) పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ఈఎ్‌ఫటీఏ దేశాలు హామీ ఇచ్చాయి. మన దేశంతో ఎఫ్‌టీఏలు కుదుర్చుకున్న ఏ దేశం లేదా దేశాలు ఇప్పటి వరకు ఇటువంటి హామీ ఇవ్వలేదు. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత భారత్‌-ఈఎ్‌ఫటీఏ మధ్య ఈ ఒప్పం దం కుదిరింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో ఈ దేశాలకు చెందిన ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

పారిశ్రామిక ఎగుమతులకు ఊతం: ఈఎ్‌ఫటీఏతో కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్‌లో తయారయ్యే దాదాపు అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులను ఎటువంటి సుంకాలు లేకుండా ఈ నాలుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడనుంది. దీనికి తోడు ప్రాసెస్‌ చేసిన భారత వ్యవసాయ ఉత్పత్తులకు దిగుమతి సుంకాల్లో ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకూ ఈఎ్‌ఫటీఏ అంగీకరించింది. దీంతో ఈ నాలుగు దేశాలకు మన పారిశ్రామిక, ప్రాసెస్‌ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడింది. ఈఎ్‌ఫటీఏలో అతిపెద్ద దేశమైన స్విట్జర్లాండ్‌ ఈ ఏడాది జనవరి నుంచే భారత పారిశ్రామిక ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తివేసింది.

దిగుమతులకు కళ్లెం: ఎగుమతుల పెంపునకు చర్యలు తీసుకుంటూనే.. ఈ దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు చౌకగా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించకుండా భారత్‌ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈఎ్‌ఫటీఏ దేశాల నుంచి దిగుమతయ్యే పాడి, పాడి ఉత్పత్తులు, సోయా, సోయా ఉత్పత్తులు, బొగ్గు, కొన్ని కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్‌ పూర్తిగా నిరాకరించింది.

అయితే ఈ దేశాలకు చెందిన అకౌంటింగ్‌, వ్యాపార సేవలు, కంప్యూటర్‌ సర్వీసులు, పంపిణీ, ఆరోగ్య సేవల వంటి 105 రకాల సేవలపై ఆంక్షల సడలింపులకు అంగీకరించింది. అందుకు ప్రతిగా భారత ఐటీ, న్యాయ నిపుణులు, ఆడియో-విజువల్‌, ఆర్‌ అండ్‌ డీ, కంప్యూటర్‌, అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ నిపుణుల రాకపోకలకు ఈఎ్‌ఫటీఏ దేశాలు అంగీకరించాయి.

తగ్గనున్న స్విస్‌ వాచీలు, చాక్లెట్ల ధర

ప్రపంచ ప్రఖ్యాత స్విస్‌ వాచీలు, గడియారాలు, బిస్కెట్లు, చాక్లెట్లను కూడా ఈ ఎఫ్‌టీఏలో చేర్చారు. దీంతో రోలెక్స్‌, ఒమెగా, కార్టియర్‌ వంటి స్విట్జర్లాండ్‌లో తయారయ్యే వాచీలపై దిగుమతి సుంకాలు తగ్గి, వాటి ధరలూ తగ్గనున్నాయి. అయితే ఇందుకోసం భారత వినియోగదారులు ఈ ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన ఏడు నుంచి పదేళ్ల పాటు వేచి చూడాలి. ఇక ఐదు నుంచి 15 డాలర్ల మధ్య ఉండే స్విస్‌ మద్యంపై దిగుమతి సుంకా న్ని తొలి ఏడాదే 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించేందుకూ మన దేశం అంగీకరించింది. తర్వాత పదేళ్లలో దీన్ని 50 శాతానికి తగ్గిస్తారు.

Updated Date - Mar 11 , 2024 | 03:03 AM