ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

road:మీరు రోడ్డు వేయండి.. మేము చూడం

ABN, Publish Date - Dec 27 , 2024 | 12:18 AM

road: వీరఘట్టం పాత తహసీల్దార్‌ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రోడ్డు నిర్మించారు.

ప్రభుత్వ స్థలంలో వేసిన రోడ్డు

- పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది

వీరఘట్టం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వీరఘట్టం పాత తహసీల్దార్‌ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రోడ్డు నిర్మించారు. పాలకొండ పార్వతీపురం మధ్యలో వీరఘట్టం ఉండడంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకుంది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ప్రభుత్వ స్థలంలో గుడిసె కట్టినా తొలగించే రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ కార్యాలయాల మధ్యలోనే దర్జాగా రోడ్డు వేసినా కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ ప్రాంతంలో తహసీల్దార్‌ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంతో పాటు విద్యాశాఖ, గృహ నిర్మాణశాఖ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇలా నిత్యం అధికారులు తిరిగే ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ స్థలంలో రోడ్డు వేసినా కనీసం రెవెన్యూ సిబ్బంది స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ సీహెచ్‌ సత్యనారాయణను వివరణ కోరగా.. ‘రోడ్డువేసిన విషయం మా దృష్టికి వచ్చింది. పరిశీలించి ప్రభుత్వ స్థలంలో కంచెను ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.

Updated Date - Dec 27 , 2024 | 12:18 AM