ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేరాలను నియంత్రించాం

ABN, Publish Date - Dec 31 , 2024 | 01:11 AM

నగర పోలీస్‌ శాఖ తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది అన్ని రకాల నేరాలను తగ్గించగలిగామని సీపీ శంఖబ్రతబాగ్చి అన్నారు.

  • తగ్గిన హత్యలు, రోడ్డు ప్రమాదాలు

  • స్వల్పంగా పెరిగిన అత్యాచారం కేసులు

  • గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం

  • రికవరీ చేసిన చోరీ సొత్తును బాధితులకు పంపిణీ చేసేందుకు ‘క్రైమ్‌ ప్రాపర్టీ మేళా’ల నిర్వహణ

  • నగరంలో శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యం

  • నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి

విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ శాఖ తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది అన్ని రకాల నేరాలను తగ్గించగలిగామని సీపీ శంఖబ్రతబాగ్చి అన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వార్షిక నివేదికను ఆయన వెల్లడించారు. హత్యలు 2022లో 39, 2023లో 23 జరిగితే ఈ ఏడాది 22కి తగ్గాయన్నారు. దాడులు గత ఏడాది పది జరిగితే, ఈ ఏడాది ఏడుకు తగ్గాయన్నారు. కిడ్నాప్‌లు 2022లో 32, 2022లో 24 జరిగితే ఈ ఏడాది 21కి తగ్గాయన్నారు. కొట్లాట కేసులు మాత్రం 2022లో 534, 2023లో 399 నమోదైదే...ఈ ఏడాది 451కి పెరిగాయన్నారు. అత్యాచారాలు గత ఏడాది కంటే ఈ ఏడాది స్వల్పంగా పెరిగాయని, అయితే వాటిలో అత్యధికం పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులేనన్నారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌లో ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలిస్తే 2022లో 10,929, 2023లో 7,979 నమోదైతే ఈ ఏడాది మాత్రం 9,142కి పెరిగాయన్నారు. ఈ ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరిగినందున ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య పెరిగిందన్నారు. తాము తీసుకున్న చర్యల కారణంగా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించలిగామన్నారు. 2022లో 1,353, 2023లో 1,180 ప్రమాదాలు జరిగితే, ఈ ఏడాది 1,094కి తగ్గాయన్నారు. ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా గత ఏడాది 1,44,907 కేసులు నమోదుచేసి రూ.16.22 కోట్లు జరిమానా విధిస్తే, ఈ ఏడాది 1,63,913 కేసులు నమోదుచేసి రూ.25.67 కోట్లు జరిమానా విధించామన్నారు. రోడ్డు ట్రాఫిక్‌ ఇంజనీరింగ్‌ పేరుతో 35 కూడళ్లను అభివృద్ధి చేయడంతోపాటు రాత్రిపూట లైటింగ్‌ పెంచామన్నారు. గంజాయి రవాణాదారులు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపామన్నారు. గత ఏడాది ఎన్‌డీపీఎస్‌ కింద 235 కేసులు నమోదుచేసి 704 మందిని అరెస్టు చేసి 4,700 కిలోల గంజాయిని సీజ్‌ చేస్తే, ఈ ఏడాది 313 కేసులు నమోదుచేసి 718 మందిని అరెస్టు చేసి 5,024 కిలోల గంజాయితోపాటు, 132 గంజాయి చాక్లెట్‌లను సీజ్‌ చేశామన్నారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజలకు విరివిగా అవగాహన కల్పించడంతో కేసుల సంఖ్య ఈ ఏడాది కాస్త తగ్గిందన్నారు. 2022లో 613 కేసులు, 2023లో 419 కేసులు నమోదైతే ఈ ఏడాది 364కి తగ్గినట్టు చెప్పారు. సైబర్‌ నేరగాళ్లు ఉపయోగించిన 2520 బ్యాంకు ఖాతాల్లో రూ.20.42 కోట్లు ఫ్రీజ్‌ చేసి, రూ.రెండు కోట్లు బాధితులకు అందజేశామన్నారు. నగరంలో తరచూ అల్లర్లు, దాడులు, హత్యలకు పాల్పడడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని గుర్తించి షీట్‌లు తెరిచామన్నారు. ఈ ఏడాది 175 మందిపై సస్పెక్ట్‌ షీట్లు, 176 మందిపై రౌడీ షీట్లు తెరిచామన్నారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, లైంగిక దాడులకు పాల్పడుతున్న 35 మందిపై రాష్ట్రంలోనే మొదటిసారిగా పియాడియోఫిల్‌ షీట్‌లు తెరిచామన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న 35 మందిపై డ్రగ్‌ అఫెండర్‌ షీట్‌, భూకబ్జాలకు పాల్పడుతున్న ముగ్గురిపై లాండ్‌ గ్రాబర్‌షీట్‌, సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న ఒకరిపై సైబర్‌ బుల్లీ షీట్‌ తెరిచామన్నారు. చోరీ కేసుల్లో రికవరీ చేసిన సొత్తును కోర్టు అనుమతితో ‘క్రైమ్‌ ప్రాపర్టీ మేళా’ నిర్వహించి బాధితులకు వెంటనే అందజేస్తున్నామన్నారు. సిబ్బంది సంక్షేమం కోసం రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరికీ ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నామన్నారు. ప్రజలకు పోలీస్‌ సహాయం అవసరమైనప్పుడు కిందిస్థాయి పోలీసులు స్పందన సరిగా లేదనిపిస్తే నేరుగా తనను ఫోన్‌లో సంప్రతించేలా రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సీపీ హెల్ప్‌లైన్‌ పేరుతో మొబైల్‌ నంబర్‌ అందుబాటులోకి తెచ్చానన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు అజితా వేజెండ్ల, మేరీప్రశాంతి, క్రైమ్‌ డీసీపీ లతామాదురి, స్పెషల్‌ బ్రాంచి డీసీపీ పి.శ్రీనివాసరావు, క్రైమ్‌ ఏడీసీపీ మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 01:11 AM