ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vishnukumar Raju: రుషికొండ లాంటి అద్భుతమైన ప్రాంతాన్ని జగన్ నాశనం చేశారు

ABN, Publish Date - Mar 01 , 2024 | 10:43 PM

డిస్ట్రక్షన్‌కు మరో పేరు సీఎం జగన్మోహన్ రెడ్డి అని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు(Vishnukumar Raju) అన్నారు. శుక్రవారం నాడు విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వయో శ్రీ కార్యక్రమం.. ఈ నెల మూడో తేదీన.. విశాఖ డీఎల్‌బీ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు.

విశాఖపట్నం: డిస్ట్రక్షన్‌కు మరో పేరు సీఎం జగన్మోహన్ రెడ్డి అని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు(Vishnukumar Raju) అన్నారు. శుక్రవారం నాడు విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వయో శ్రీ కార్యక్రమం.. ఈ నెల మూడో తేదీన.. విశాఖ డీఎల్‌బీ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రలో పలు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని ప్రకటించారు. రుషికొండ లాంటి అద్భుతమైన ప్రాంతాన్ని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. రిషికొండ రిసార్ట్స్ ప్రారంభం ప్రభుత్వ కార్యక్రమం సీక్రెట్‌గా చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రజల సొత్తు .. దొంగ చాటుగా చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు.

రుషికొండనే బోడి గుండు చేసిన ఈ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని మందలించారు. బే పార్క్ రాడిసన్ హోటల్స్ బినామీలు ఎవరని ప్రశ్నించారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రారని చెప్పారు. హామీలు ఇచ్చి మోసం చేసిన వాళ్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని నిలదీశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. ‘సిద్ధం’ పోస్టర్ చూస్తుంటే తనకు ఓటు వేయకపోతే లాగి కొడతాం.. లేదంటే లేపేస్తాం అన్నట్లుందని అన్నారు. ‘ఆడదాo ఆంధ్ర’ మ్యాచ్‌కి డ్వాక్రా మహిళలని తీసుకువెళ్లడం ఇంతవరకు తాను ఎప్పుడు చూడలేదని అన్నారు. వలంటీర్లు పోల్ ఏజెంట్‌గా పెడితే ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని హెచ్చరించారు. విశాఖ నార్త్‌లో 40 వేల దొంగ ఓట్ల చేర్చారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి....

Updated Date - Mar 01 , 2024 | 11:03 PM

Advertising
Advertising