ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మేసిన పొగమంచు

ABN, Publish Date - Dec 30 , 2024 | 11:44 PM

ఏజెన్సీ వ్యాప్తంగా సోమవారం పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో చలి తీవ్రత సైతం కొనసాగింది. గత ఐదు రోజులుగా ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురవడం, మధ్యాహ్నం రెండు గంటలు మాత్రమే గట్టిగా ఎండ కాస్తుండడంతో పగలు, రాత్రుళ్లు తేడా లేకుండా చలి ప్రభావం అధికంగానే ఉంది.

పాడేరు అంబేడ్కర్‌ సెంటర్‌లో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు పొగమంచు

జి.మాడుగులలో 12.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

పాడేరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ వ్యాప్తంగా సోమవారం పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో చలి తీవ్రత సైతం కొనసాగింది. గత ఐదు రోజులుగా ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురవడం, మధ్యాహ్నం రెండు గంటలు మాత్రమే గట్టిగా ఎండ కాస్తుండడంతో పగలు, రాత్రుళ్లు తేడా లేకుండా చలి ప్రభావం అధికంగానే ఉంది. దీంతో జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

జి.మాడుగులలో 12.1 డిగ్రీలు

ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గలేదు. సోమవారం జి.మాడుగులలో 12.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, చింతపల్లిలో 12.4, హుకుంపేటలో 13.4, పెదబయలు, అరకులోయలో 13.5, జీకేవీధిలో 13.6, డుంబ్రిగుడలో 13.7, పాడేరులో 14.5, ముంచంగిపుట్టులో 15.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Dec 30 , 2024 | 11:44 PM