AP News: వంజంగి మంచు మేఘాల కొండ సందర్శనకు బ్రేక్
ABN, Publish Date - Jan 01 , 2024 | 04:21 PM
Andhrapradesh: జిల్లాలోని వంజంగి మంచు మేఘాల కొండ సందర్శనకు బ్రేక్ పడింది. ఈ రోజు (సోమవారం) నుంచి తొమ్మిదవ వరకు వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. వంజంగి పర్యాటక కేంద్రం కాలుష్యంతో నిండినందున, ప్లాస్టిక్ వ్యర్ధాల తొలగింపు, రహదారి మరమ్మత్తులు తదితర కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
అల్లూరి జిల్లా, జనవరి1 : జిల్లాలోని వంజంగి మంచు మేఘాల కొండ (Vanjangi Hills) సందర్శనకు బ్రేక్ పడింది. ఈ రోజు (సోమవారం) నుంచి తొమ్మిదవ వరకు వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (Collector Sumith Kumar) ప్రకటన విడుదల చేశారు. వంజంగి పర్యాటక కేంద్రం కాలుష్యంతో నిండినందున, ప్లాస్టిక్ వ్యర్ధాల తొలగింపు, రహదారి మరమ్మత్తులు తదితర కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు గమనించి జనవరి రెండవ నుంచి తొమ్మిదవ వరకూ వంజంగి మంచు మేఘాలకొండ సందర్శనకు రావద్దన్న కలెక్టర్ సుమిత్ కుమార్ వినతి చేశారు.
Updated Date - Jan 01 , 2024 | 04:22 PM