ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదల అభివృద్ధే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే

ABN, Publish Date - Dec 31 , 2024 | 11:35 PM

పేదల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

పింఛన్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే,

కర్నూలు రూరల్‌ డిసెంబరు31(ఆంధ్రజ్యోతి): పేదల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు మండలం శివరాంపురం గ్రామంలో మంగళవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్ల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం దశల వారిగా నెరివేర్చి మాట నిలబెట్టుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఘునాథ్‌, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

ఫ పంచలింగాల గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లను లబ్దిదారులకు ఎంపీ నాగరాజు అందజేశారు. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలల్లోనే 75శాతం హామీలు నెరవేర్చినట్లు తెలిపారు.

గూడూరు: పేదల అభ్యున్నతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని మండల టీడీపీ అధ్యక్షుడు జే.సురేష్‌ అన్నారు. మంగళవారం గూడూరు మండలంలోని మల్లాపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు సృజన, జగదీశ్వర్‌ రెడ్డి, సుల్తాన, కాశీం పాల్గొన్నారు. ఆర్‌.కానాపురంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు సుమన బాబు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ మునిస్వామి పాల్గొన్నారు.

ఓర్వకల్లు: మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం సామాజిక భద్రతా పించన్లు పంపిణీ చేశారు. హుశేనాపురంలో కాల్వబుగ్గ మాజీ చై ర్మన చంద్రపెద్దస్వామి, టీడీపీ యువ నాయకుడు సమీర్‌, ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శ్రీనివాసులు, అధికారులు పింఛన్లను పంపిణీ చేశారు.

Updated Date - Dec 31 , 2024 | 11:35 PM