ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Jagan: ఇకపై జగన్ కుటుంబ సభ్యులకూ ఎస్ఎస్‌జీ భద్రత..

ABN, Publish Date - Jan 25 , 2024 | 07:45 AM

ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యుల భద్రత కోసం ఏపీలో ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం 2023కు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు చట్టం అమల్లోకి వచ్చినట్టుగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా నోటిఫికేషన్ జారీ చేశారు.

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యుల భద్రత కోసం ఏపీలో ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం 2023కు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు చట్టం అమల్లోకి వచ్చినట్టుగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ వింగ్‌తో పాటు ముఖ్యమంత్రి భద్రత కోసం అదనంగా స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గత శాససభ సమావేశాల్లో చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించింది.

ముఖ్యమంత్రి సహా ఆయన కుటుంబ సభ్యులకు పటిష్టమైన భద్రత కల్పించేలా తీసుకువచ్చిన ఈ ఎస్ఎస్‌జీ గ్రూప్‌నకు ప్రత్యేక న్యాయ రక్షణ కూడా ఉండేలా చట్టంలో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదించటంతో ఇది అమల్లోకి వచ్చినట్టు హోంశాఖ ముఖ్యకార్యదర్శి పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం భద్రతకు ఒక విభాగం ఉన్నప్పటికీ దానికి చట్టబద్ధత లేదు. ఎస్‌ఎస్‌జీ ద్వారా ముఖ్యమంత్రి, భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు భద్రత కల్పిస్తారు.

ముఖ్యమంత్రి నివాసం వద్ద, రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల్లో ప్రయాణించేటప్పుడు, నడకలోనూ వారికి భద్రత అందిస్తారు. ఏదైనా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడూ ఈ రక్షణ ఉంటుంది. ఏపీతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ నివసిస్తున్న సీఎం కుటుంబసభ్యుల భద్రత కోసం ఎస్‌ఎస్‌జీ పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్‌ ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరికీ ప్రభుత్వ ఖర్చుతో భద్రత ఏర్పాటు చేస్తారు.

Updated Date - Jan 25 , 2024 | 07:47 AM

Advertising
Advertising