punished ఎంపీడీవోపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ABN, Publish Date - Dec 28 , 2024 | 11:33 PM
punished అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీ డీవో జవహర్‌బాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది డిమాండ్ చేశారు.
కోటబొమ్మాళి/జలుమూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీ డీవో జవహర్‌బాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కోటబొమ్మాళి, జలుమూరు మండలాల్లో ఎంపీడీవోలు ఫణీంద్రకుమార్, కె.అప్పలనాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎంపీడీవో తన ఉద్యోగ ధర్మం పాటిస్తే వైసీపీ నేతలు ఎంపీ డీవోతో పాటు అటెండర్ ఇమ్రాన్, కారు డ్రైవర్‌లపై దాడి చేయటం దారుణమని, ఏ రాజకీయ నాయకుడైన ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేస్తే కఠిన శిక్షలుంటాయని, వారు భయపడేలా దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు, సూపరింటెండెంట్ దామోదరరావు, కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు డి.బాలకృష్ణ, వి.రమేష్, ఎంపీడీవో కార్యాల యాల సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2024 | 11:33 PM