drones నగరంలో డ్రోన్లతో నిఘా
ABN, Publish Date - Dec 28 , 2024 | 12:18 AM
Surveillance with drones in urban areas బహిరంగంగా మద్యం, గంజాయి తాగ డం, పేకాట, ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలపై జిల్లా పోలీసు యంత్రాంగం డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఏర్పాటు చేసింది.
- అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి
- ప్రశాంత సిక్కోలు లక్ష్యం: ఎస్పీ
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): బహిరంగంగా మద్యం, గంజాయి తాగ డం, పేకాట, ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలపై జిల్లా పోలీసు యంత్రాంగం డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఏర్పాటు చేసింది. శుక్రవారం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో డచ్ బంగ్లా, గుడివీఽధి, కంపోస్ట్ కాలనీ, అరసవ ల్లి, నాగావళినది పరివాహక ప్రాంతాలతోపాటు పలు ప్రాంతాల్లో పాడుపడిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు పలు చిత్రాలు తీసి అక్కడి పరిస్థితులను పరిశీలిం చారు. నేర నియంత్రణే లక్ష్యంగా డ్రోన్ కెమె రాల సాయంతో పోలీసులు పహారా కాస్తు న్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడు తూ.. ప్రశాంత సిక్కోలు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు ఎవరైన పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Updated Date - Dec 28 , 2024 | 12:21 AM