ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Physical fitness test for constable:కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం

ABN, Publish Date - Dec 30 , 2024 | 11:24 PM

Physical fitness test for constable: పోలీసు కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదానంలో అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సోమవారం ప్రారంభమయ్యాయి.

అభ్యర్థికి ఛాతీ కొలతలు తీస్తున్న దృశ్యం

ఎచ్చెర్ల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలీసు కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదానంలో అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్‌ మెజర్‌మెంటు (పీఎంటీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ (పీఈటీ) పరీక్షలు నిర్వహిస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన, బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ తీసుకుంటున్నారు. అలాగే ఫిజికల్‌ మెజర్‌మెంట్‌కు సంబంధించి ఛాతీ, ఎత్తు కొలతలు నిర్వహించారు. ఫిజికల్‌ ఎఫిషియన్సీలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌ నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి అంశాన్ని సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేశారు. నీరు, వైద్య శిబిరాన్ని అందుబాటులో ఉంచారు. ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసుకుని, ఈవెంట్‌లో ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించాలని అభ్యర్థులకు ఎస్పీ సూచించారు. మొదటి రోజు 600 మంది అభ్యర్థులకు గాను 322మంది హాజరయ్యారు. వీరిలో 192 మంది ఎంపికయ్యారు.

Updated Date - Dec 30 , 2024 | 11:24 PM