ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Tourism: బుక్‌ మై దర్శన్‌తో యాత్రికులకు బంపరాఫర్

ABN, Publish Date - Feb 29 , 2024 | 02:01 PM

Andhrapradesh: ఏపీ టూరిజం, బుక్ మై దర్శన్ ఆధ్వర్యంలో నూతన టూరిజం బస్సులు ప్రారంభించినట్లు బుక్ మై దర్శన్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆలీ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బుక్ మై దర్శన్ ద్వారా ఏపీలోని పుణ్యక్షేత్రాలకు ఏపీ టూరిజం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

విజయవాడ, ఫిబ్రవరి 29: ఏపీ టూరిజం (AP Tourism), బుక్ మై దర్శన్ ఆధ్వర్యంలో నూతన టూరిజం బస్సులు ప్రారంభించినట్లు బుక్ మై దర్శన్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆలీ (Book My Darshan Operations Director Ally) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బుక్ మై దర్శన్ ద్వారా ఏపీలోని పుణ్యక్షేత్రాలకు ఏపీ టూరిజం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుక్ మై దర్శన్ సుమారు 17 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏపీలోని (Andhrapradesh) ప్రముఖ దేవాలయాలలో దర్శనం చేసుకోవచ్చన్నారు. బుక్ మై దర్శన్ ద్వారా యాత్రలకు వెళ్తే త్వరగా దర్శనం జరిగే వెసులుబాటు ఉంటుందన్నారు. యాత్రికులకు ఏపీ టూరిజం రూంలను, హోటల్ హరిత రిసార్ట్స్ ద్వారా ఫుడ్‌ను బుక్ మై దర్శన్ అందుబాటులోకి తీసుకు వస్తుందన్నారు. బుక్ మై దర్శన్ ద్వారా ఇండియాలోని ప్రసిద్ధ క్షేత్రాలను యాత్రికులు దర్శించుకునే అవకాశం ఉందని అలీ పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 29 , 2024 | 02:07 PM

Advertising
Advertising