ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దర్జాగా భూ ఆక్రమణ

ABN, Publish Date - Dec 23 , 2024 | 12:11 AM

నూజివీడు మండలంలో భారీ భూ ఆక్రమణకు కొంద రు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కలిసి ప్రయ త్నాలు చేపట్టారు. దీనిని గమనించిన గ్రామస్థులు భూ ఆక్రమణలకు వినియోగిస్తున్న ఎక్స్‌కవేటర్‌ను అడ్డుకుని సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు తెలపడంతో భూ ఆక్రమణ పర్వానికి తాత్కాలికంగా తెరపడింది.

రావిచర్ల నల్లగట్టుకు ర్యాంప్‌ వేస్తున్న ఎక్స్‌కవేటర్‌

వారం రోజులుగా రావిచర్ల నల్లగట్టు పైకి ర్యాంపు

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆగని ఓ వైసీపీ నాయకుడి దూకుడు

అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండదండలు

పనులను అడ్డుకున్న గ్రామస్థులు

సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌కు సమాచారం

ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

నూజివీడు టౌన్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నూజివీడు మండలంలో భారీ భూ ఆక్రమణకు కొంద రు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కలిసి ప్రయ త్నాలు చేపట్టారు. దీనిని గమనించిన గ్రామస్థులు భూ ఆక్రమణలకు వినియోగిస్తున్న ఎక్స్‌కవేటర్‌ను అడ్డుకుని సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు తెలపడంతో భూ ఆక్రమణ పర్వానికి తాత్కాలికంగా తెరపడింది. దీనికి సంబంధించిన వివరాలివి.. నూజివీడు మండలం రావిచర్ల నల్లగట్టు ప్రాంతంలో నూజివీడు పట్టణానికి చెందిన ఓ ప్రముఖుడు, వైసీపీ నాయకుడికి రెండు ఎకరాల భూమి ఉంది. దానికి అనుబంధంగా మరో ఆరు ఎకరాల బీఫాం భూమిని కొనుగోలు చేసిన అతడు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పక్కనే ఉన్న నల్లగట్టు శిఖర భాగంలో చెట్లను తొలగించి తనకు అనుకూలంగా మొక్కలను నాటుకుంటూ భూఆక్రమ ణల పర్వానికి తెరలేపాడు. కూటమి ప్రభుత్వం ఏర్ప డిన తర్వాత కూడా ఆ భూఆక్రమణల పర్వం ఆగ లేదు. నూజివీడుకు చెందిన కొందరు టీడీపీ నాయకుల అండదండలతో ఏకంగా నల్లగట్టుపైకి వారంరోజులుగా ర్యాంప్‌ను వేస్తున్నారు. అయితే ఇది గమనించిన రావి చర్ల గ్రామస్థులు ర్యాంప్‌ వేయడాన్ని నిలుపుదల చేయాలంటూ ఆదివారం పనులను అడ్డుకున్నారు. సమాచారాన్ని నూజివీడు సబ్‌ కలెక్టర్‌, నూజివీడు తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లడంతో పనులను నిలుపు దల చేయించిన రెవెన్యూ అధికారులు ర్యాంప్‌ వేసేందు కు ఉపయోగిస్తున్న ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేశారు. సోమవారం నల్లగట్టు ప్రాంతాన్ని పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్టు నూజివీడు తహసీల్దార్‌ సుబ్బా రావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Dec 23 , 2024 | 12:11 AM