పని వేళలు పాటించాలి
ABN, Publish Date - Dec 31 , 2024 | 01:12 AM
ఆసుపత్రిలో ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించాలని, మధ్యాహ్న సమయంలో భోజనానికి రెండు గంటలు వెళ్లడం సరికాదని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కే.వెంకటేశ్వర్లు అన్నారు.
జీజీహెచ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రిలో ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించాలని, మధ్యాహ్న సమయంలో భోజనానికి రెండు గంటలు వెళ్లడం సరికాదని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కే.వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం సర్వజన వైద్యశాల ధన్వంతరీ హాలులో మినిస్ర్టీరియల్ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా నూతనంగా పదవీ బాధ్యత లు చేపట్టిన డిప్యూటీ కలెక్టర్ హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్ పి.సింధూ సుబ్రహ్మ ణ్యంను సిబ్బంది పరిచయం చేసుకున్నారు. మధ్యాహ్న సమ యంలో భోజనానికి కొందరు మినిస్టీరియల్ సిబ్బంది రెండు గంటలు వెళ్తున్నారనీ, ఈ విషయాన్ని ఇటీవల ఆడిట్ నిర్వహించిన బృందం కూడా ఫిర్యాదు చేసిందని, ఇకముందు భోజనానికి కేటాయించిన సమయంలో వెళ్లి రావాల న్నారు. సదరం, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కోరారు. హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్ పి.సిందూ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆసుపత్రిలో పలు విభాగాల్లో శానిటేషన సెక్యూరిటీ పని తీరు మెరుగుపర చాలన్నారు. సమీక్షలో హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్లు డాక్టర్ శివబాల, న్యూడ యోగ్నస్టిక్ బ్లాక్ ఇనచార్జి డా. సునీల్ ప్రశాంత, ఏడీ రమేష్‌బాబు, ఏడీ శ్రీనివాసులు, ఆఫీసు సూపరిం టెండెంట్ లతీఫ్ బేగ్ పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2024 | 01:12 AM