ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జ్ఞాన సముపార్జనతో జీవన్ముక్తి

ABN, Publish Date - Dec 27 , 2024 | 12:18 AM

జ్ఞాన సముపార్జనతో జీవన్ముక్తి లభిస్తుందని హైందవ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్‌ దాస్‌ భక్తులకు ఉద్బోధించారు.

భక్తులనుద్దేశించి ప్రసంగిస్తున్న రాధా మనోహర్‌ దాస్‌

ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్‌ దాస్‌

కర్నూలు కల్చరల్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): జ్ఞాన సముపార్జనతో జీవన్ముక్తి లభిస్తుందని హైందవ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్‌ దాస్‌ భక్తులకు ఉద్బోధించారు. ధనుర్మాసం సందర్భంగా గురువారం నగర శివారులోని గోదా రంగనాథస్వామి దేవస్థానం (గోదా గోకులం)లో జరుగుతున్న ధార్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగిం చారు. నియమ నిష్టలతో భగవంతుడిని సేవించుకుంటే సకల సంపదలు మన వశమవు తాయన్నారు. కాగా గోకులంలో కొనసాగుతున్న అఖండ విష్ణు సహస్ర నామ పారాయణ సప్తాహం కార్యక్రమంలో భాగంగా ఐదో రోజున గురు వారం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోకులం వ్యవస్థాపక అధ్యక్షుడు మారం నాగరాజ గుప్త, ఛైర్మన పల్లెర్ల నాగరాజు, గోదాగోకులం సభ్యులు మహేశ్వరరెడ్డి, తల్లం సురేశ, పాలాది వెంకట సుబ్రహ్మణ్యం, టి. శ్రీనాధ్‌, చిత్రాల వీరయ్య, వేముల జనార్థన, బాల సుధాకర్‌, ఆలయ వేద పండితులు రమేష్‌ బట్టార్‌, కిరణ్‌ బట్టార్‌, మహిళా విభాగం సభ్యులు ధర్మరాజు శైలజ, పాలాది విజయ, చంద్రకళ, సరిత పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:18 AM