శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Dec 30 , 2024 | 12:17 AM
శ్రీశైల మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సంవత్సరం ముగింపు రోజులు కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు.
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
శ్రీశైలం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సంవత్సరం ముగింపు రోజులు కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. వేకువజాము నుంచే స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. భక్తుల రద్దీతో క్యూ కంపార్ట్‌మెంట్స్ అన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామి, అమ్మవార్ల దర్శనానికి 4 గంటలపైగా సమయం పట్టింది. రోజులో మూడు విడతలుగా స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించారు.
Updated Date - Dec 30 , 2024 | 12:17 AM